Vladimir Putin: త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటన ?

త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటన ?

Vladimir Putin : రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ గురువారం ఆసక్తికర ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) ఈ ఏడాది చివర్లో భారత్‌ పర్యటనకు రానున్నట్లు తెలిపారు. సుంకాలు అమాంతం పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌… భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వేళ పుతిన్‌ (Vladimir Putin) భారత్‌ పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్‌ భారత్‌ పర్యటనతో చమురు కొనుగోలులో కీలక ప్రోత్సాహకాలు లభించే అవకాశముంది.

Vladimir Putin India Tour

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోను చేయడం మింగుడు పడని ట్రంప్‌… గత కొన్నాళ్లుగా సుంకాల పేరిట భారత్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, చిరకాల మిత్రుడు రష్యాతో సంబంధాలను బలహీనపరచుకోవడం ఇష్టం లేని భారత్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ తరుణంలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను రష్యా బలోపేతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా… చమురు కొనుగోలుతో పాటు, వివిధ అంశాలపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు అజిత్‌ డోభాల్‌ మాటల్లో తెలుస్తోంది.

ఇప్పటికే రష్యా నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఒకవేళ ప్రోత్సాహకాలకు సంబంధించిన ఒప్పందాలు కార్యరూపం దాల్చితే.. కొనుగోలు పరిమాణం మరింత పెరుగుతుంది. అదే సమయంలో అమెరికా సుంకాలను మరింత పెంచే అవకాశం ఉంది. అందువల్ల మోదీ ప్రభుత్వం అటు అమెరికాను, ఇటు రష్యాను దూరం చేసుకోకుండా తన విదేశాంగ విధానాన్ని సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత గాడి తప్పకుండా చూసుకోవాలి. అగ్రరాజ్యం సుంకాల మోత మోగించకుండా ఉండాలంటే భారత్‌ చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రష్యా (Russia), ఉక్రెయిన్‌ దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల కాల్పుల విరమణకు తనవంతు కృషి చేయాలి. ఒకవేళ అది సాధ్యమైతే.. అమెరికా సుంకాలు భారాన్ని తగ్గించే అవకాశాలు లేకపోలేదు.

రష్యా నుంచి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్‌ ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా నిందించడం, టారిఫ్‌ పెంచుతూ బుధవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌ఏ ధోవల్‌ మాస్కో వెళ్లడం గమనార్హం. క్రెమ్లిన్‌లో గురువారం ఆయన అధ్యక్షుడు పుతిన్‌తో (Vladimir Putin) సమావేశమయ్యారు. అనంతరం మాస్కోలో ధోవల్‌ స్పుత్నిక్‌ న్యూస్‌తో మాట్లాడారు.

భారత్‌–రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ‘భారత్‌–రష్యాలది చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేం ఎంతో విలువైందిగా భావిస్తున్నాం. మా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి సంబంధాలు, బంధాన్ని బలీయంగా మార్చడంలో ఎంతో సాయపడ్డాయి’అని ధోవల్‌ పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో చేపట్టే పర్యటనపై మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పర్యటన తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు దేశాల నేతల మధ్య జరిగే శిఖరాగ్రం ఎంతో కీలకం కానుంది’ అని ధోవల్‌ వివరించారు.

‘ఈ శిఖరాగ్రం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. వీరి మధ్య జరిగే చర్చలు స్పష్టమైన, గణనీయమైన ఫలితాలను అందివ్వనున్నాయి’ అని దోవల్‌ ఆశాభావం వ్యక్తం చేసినట్లు టాస్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా ఉండగా, ముడి చమురు దిగుమతులపై పశి్చమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంపైనా ధోవల్‌ రష్యా ఉన్నతాధికారులతో చర్చించారు. ఒప్పందం ప్రకారం మిగతా రెండు ఎస్‌–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కోరారు.

Also Read : Rahul Gandhi: బీజేపీ, ఈసీలపై రాహుల్‌ సంచలన ఆరోపణలు

Leave A Reply

Your Email Id will not be published!