Vote From Home : ఇంటి వద్దకే ఓటు ప్రారంభం
స్టార్ట్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
Vote From Home : హైదరాబాద్ – తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. వాస్తవానికి నవంబర్ 30న ఓట్లు పోల్ కానున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్తగా వికలాంగులు, వృద్దులు, మహిళలకు మేలు చేకూర్చేందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఈసీ ఆదేశాల మేరకు సిఇఓ వికాస్ రాజ్ రాష్ట్ర వ్యాప్తంగా వృద్దులు ఉన్న ఇంటి వద్దకే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
Vote From Home Updates
ఓట్ ఫ్రం హోంను ఈసీ ప్రారంభించడంతో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది విభిన్న ప్రతిభావంతులు, వృద్దుల నుంచి. ఈ కార్యక్రమం నిన్ననే ప్రారంభమైంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 91 ఏళ్ల వయసు కలిగిన చుండూరి అన్నపూర్ణ వద్దకు ఈసీ(EC) సిబ్బంది వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా చూశారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో వృద్దులకు సంబంధించి తొలి ఓటు వేసిన ఓటర్ గా చరిత్ర సృష్టించింది అన్నపూర్ణ. ఇదిలా ఉండగా ఫాం 12డి దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల అధికారులే ఇంటి వద్దకు వస్తారు. తమ వద్ద నుంచి ఓటు వేయించుకుంటారు.
ఇలాంటి సదుపాయాన్ని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
Also Read : Judson Bakka : వెన్నెల గద్దర్ గెలుపు పక్కా