Ukraine Russia War : ఉక్రెయిన్ పై రష్యా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఎడ తెరిపి లేకుండా దాడులు చేస్తోంది. ఊపిరి తీసుకోనియకుండా బాంబుల మోత మోగిస్తోంది. మిస్సైల్స్ ను ప్రయోగిస్తోంది.
3 లక్షల 70 వేల మందికి పైగా ప్రజలు శరణార్థులుగా మారి పోయారు. పిల్లలు, వృద్దులు ఇలా రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కల్లోల పరుస్తున్నాయి.
ఒక వైపు చర్చల మంత్రం జపిస్తూనే ఇంకో వైపు దాడులకు పాల్పడుతోంది. ఉక్రెయిన్(Ukraine Russia War ) దళాల ప్రతిఘటనతో ఇరు వైపులా ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే కొనసాగుతోంది.
ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్క్కీ రష్యా చీఫ్ పుతిన్ తో చర్చలకు సిద్దమని స్పష్టం చేశారు. మరో వైపు చర్చలకు సిద్దం అంటూనే ఇంకో వైపు యుద్దానికి సిద్దమని ఇటు ఉక్రెయిన్ (Ukraine Russia War)అటు రష్యా ప్రకటిస్తున్నాయి.
చర్చల ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఉక్రెయిన్ తో పాటు రష్యా తీవ్రంగా నష్ట పోతోంది. ఇదిలా ఉండగా కీవ్ లో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
విద్యార్థులు ఎవరైనా పశ్చిమ వైపు ఉన్న రైల్వే స్టేషన్ కు వెళ్లాలని సూచించింది. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. మరో వైపు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది.
ఉక్రెయిన్ కు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా యుద్ధ విమానాల్ని యూరోపియన్ దేశాలు పంపిస్తుండడంతో ఇప్పట్లో శాంతి అన్నది కష్టంగా మారింది.
ఇదే క్రమంలో రష్యాకు మద్దతుగా ఉన్న బెలారస్ పై జపాన్ ఆంక్షలు విధించింది. రష్యాపై ఆస్ట్రేలియాపై ఆంక్షలు విధించింది. ప్రయాణ ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read : బైడెన్ నిర్వాకం రష్యా యుద్ధం