Velagapudi Ramakrishna Babu: టీడీపీ ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్‌ ! పోలీసులకు ఫిర్యాదు !

టీడీపీ ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్‌ ! పోలీసులకు ఫిర్యాదు !

Velagapudi Ramakrishna Babu: విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వెలగపూడి రామకృష్ణబాబుకి(Velagapudi Ramakrishna Babu) అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి 8.30 గంటల నుండి 11 గంటల వరకు గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్‌ ద్వారా ఫోన్‌ చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారని ఎమ్మెల్యే వెలగపూడి ఆరోపిస్తున్నారు. దీనిపై ఆదివారం స్థానిక ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఫోన్‌ నంబర్ల వివరాలను పోలీసులకు అందజేశారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవడంతో పాటు, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Velagapudi Ramakrishna Babu Given Police Complaint

వెలగపూడి రామకృష్ణబాబు… విశాఖ తూర్పు(Visakhapatnam East) నియోజకవర్గంలో మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు. ఇదే నియోజకవర్గం నుండి 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 2019లో వైసీపీ ప్రభంజనంలో కూడా ఓటమి ఎరుగని నేతగా కొనసాగుతున్నారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన మొదటి జాబితాలో వెలగపూడి రామకృష్ణబాబు చోటు దక్కించుకున్నారు.

Also Read : AP BJP Chief : టీడీపీ జనసేనతో పొత్తులపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!