Wasim Jaffer : వసీం జాఫర్ ఆసియా, టీ20 వరల్డ్ కప్ టీం
పాండ్యా, చాహల్ , త్రిపాఠీలకు చోటు
Wasim Jaffer : ఎప్పుడూ లేనంతటి టెన్షన్ నెలకొంది భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీలో. ప్రధానంగా చైర్మన్ గా ఉన్న చేతన్ శర్మ మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. ఎందుకంటే ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ జరగనుంది.
దీనిని ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. ఇక టీ20 జట్టును ఎంపిక చేయడం ఇప్పుడు కత్తి మీద సాములాగా తయారైంది. యువ ఆటగాళ్లతో
పాటు సీనియర్లు సైతం దుమ్ము రేపారు ఐపీఎల్ 2022లో. దీంతో ఎవరిని పక్కన పెట్టాలి.
ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది ఎంపిక కమిటీ. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, ఫినిషర్లు, ఫీల్డర్లు,
వికెట్ కీపర్లతో పాటు ఆల్ రౌండర్లలో తుది జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది.
నిన్నటి దాకా పేలవమైన ఆట తీరుతో ఇబ్బంది పడ్డ కోహ్లీ గుజరాత్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఫామ్ లోకి వచ్చాడు. ఇక రోహిత్ శర్మ
ఈసారి ఆశించిన మేర రాణించ లేక పోయాడు.
తన జట్టును గెలిపించ లేక పోయాడు ఐపీఎల్ లో. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరికీ ఈసారి ఐపీఎల్ అచ్చి రాలేదనే చెప్పక తప్పదు. ఈ ఏడాది రెండు కప్ లు జరగనున్నాయి.
ఆగస్టు – సెప్టెంబర్ లో ఆసియా కప్ , అక్టోబర్ – నవంబర్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇలా ఉండగా భారత జట్టు
మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer) తన జట్టును ప్రకటించాడు. రెండు కప్ లకు టీంలను ప్రకటించాడు.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్ ) , కోహ్లీ, సూర్య కుమార యాదవ్ , పంత్ (కీపర్ ) , పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్ , భువనేశ్వర్ కుమార్ , యుజ్వేంద్ర చహాల్ , జస్ ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశాడు. వీరితో పాటు ఇతర ఆటగాళ్లను కూడా చేర్చాడు.
రుతురాజ్ గైక్వాడ్ , దినేశ్ కార్తీక్, సంజూ శాంసన్ , అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , షమీ, దీపక్ చహార్ , బ్యాకప్ ప్లేయర్లుగా పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, నట రాజన్ ఉన్నారు.
Also Read : ప్లే ఆఫ్స్ పై వీడని ఉత్కంఠ