PM Modi : టర్కీకి సహాయం చేస్తాం – నరేంద్ర మోదీ
భారీ ఎత్తున ఆస్తి..ప్రాణ నష్టం
PM Modi : టర్కీలో జరిగిన భూకంపంలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి 100 మందికి పైగానే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. కానీ మృతుల, బాధితుల సంఖ్య మరింత పెరగనుందని అంచనా. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 6 సోమారం చోటు చేసుకున్న భూకంప నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) .
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. టర్కీకి అవసరమైన సహాయం చేస్తామని ప్రకటించారు. సహాయక కార్యక్రమాలలో భారత దేశానికి చెందిన ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం భారత్ జీ20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది. ప్రపంచ దేశాలకు దిశా నిర్దేశం చేస్తోంది. ఈ తరుణంలో టర్కీలో ఈ ఘోర ఘటన జరగడంపై తీవ్రంగా స్పందించారు మోదీ(PM Modi) . ఈ మేరకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునేందుకు రెడీగా ఉన్నామని మరోసారి ఉద్ఘాటించారు.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి కర్ణాటక లోని బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2023 సదస్సును ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ అభివృద్ది చేసిన సోలార్ కుకింగ్ సిస్టమ్ ట్విన్కుక్ టాప్ మోడల్ ను మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.
తమ ప్రభుత్వం ఆవిష్కరణలకు ప్రయారిటీ ఇస్తున్నదని చెప్పారు ప్రధానమంత్రి. ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ప్రకృతి ప్రకోపం టర్కీలో భూకంపం