Leena Manimekalai : ఎవ‌రీ లీనా మ‌ణిమేక‌లై ఏమిటా క‌థ‌

కాళి పోస్ట‌ర్ తో తీవ్ర వివాదం

Leena Manimekalai : దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది కాళీదేవి పోస్ట‌ర్. దీనిని రూపొందించారు భార‌త దేశంలోని త‌మిళ‌నాడుకు చెందిన ఫిల్మ్ మేక‌ర్ లీనా మ‌ణికేక‌లై(Leena Manimekalai) .

గూగుల్ లో ఎక్కువ‌గా ఎవ‌రీ లీనా ఏమిటా క‌థ అంటూ పెద్ద ఎత్తున వెతికారు కూడా. ఇంకా శోధిస్తూనే ఉన్నారు. ఒక్క రోజులోనే పాపుల‌ర్ అయ్యారు.

మ‌రో వైపు వివాదాస్ప‌దంగా మారారు.

ఆమె షేర్ చేసిన పోస్ట‌ర్ దుమ్ము దుమారం రేపుతోంది. దీనికి స్పందిస్తూ టీఎంసీ ఎంపీ మ‌హూ మోయిత్రా చేసిన ట్వీట్ తో మ‌రింత క‌ల‌క‌లం రేగింది. చివ‌ర‌కు బీజేపీ రంగంలోకి దిగింది.

వెంట‌నే అభ్యంత‌రం చెప్ప‌డం. ఆ త‌ర్వాత ఎంపీపై కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింది. స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో న‌డుస్తోంది వ్య‌వ‌హారం. ఇక లీనా మ‌ణిమేక‌లై దాదాపు రెండు ద‌శాబ్దాలుగా సినీ రంగంలో కొన‌సాగుతూ వ‌స్తోంది.

సామాజిక స‌మ‌స్య‌ల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతూ వ‌చ్చారు ఇప్ప‌టి వ‌ర‌కు. త‌న చిత్రాల ద్వారా వివాదాల‌ను రాజేసింది లీనా. చిత్ర నిర్మాత అయినా

లీనా మ‌ణిమేక‌లై త‌న తాజా చిత్రం కాళి పోస్ట‌ర్ పై యూపీ, ఢిల్లీలో కేసులు న‌మోద‌య్యాయి.

త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఆమె తిప్పికొట్టింది. తాను జీవించి ఉన్నంత వ‌ర‌కు త‌న గొంతును పెంచుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేసింది. త‌మిళ‌నాడు మ‌ధురై లోని మ‌హారాజ‌పురంలో పుట్టిన ఈమెకు వివాదాలు కొత్తేమీ కాదు.

తండ్రి కాలేజీ లెక్చ‌ర‌ర్. పెళ్లికి ప్లాన్ చేస్తే వ‌ద్ద‌ని చెన్నైకి చేరుకుంది. ఓ త‌మిళ ప‌త్రిక‌లో ఉద్యోగం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. షాక్ తిన్న పత్రిక యాజామాన్యం ఆమెను కుటంబానికి అప్ప‌గించింది.

ఇంజ‌నీరింగ్ కోర్సు ఆఖ‌రులో ఉండ‌గా తండ్రిని కోల్పోయంది. త‌న ఫ్యామిలీని పోషించు కునేందుకు లీనా కొన్నాళ్లు బెంగ‌ళూరులోని ఒక ఐటీ

సంస్థ‌లో ప‌ని చేసింది. 2002లో త‌న మొద‌టి చిత్రం మ‌హాత్మాలో ప‌ని చేయ‌డం ప్రారంభించింది.

ఆనాటి నుంచి వెనుదిరిగి చూడ‌లేదు. స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల‌పై లీనా మ‌ణిమేక‌లై(Leena Manimekalai)  చేసిన కృషికి అనేక ఫెలో షిప్ లు గెలుచుకుంది.

ఆమె తీసిన చిత్రాలు వివిధ అంత‌ర్జాతీయ చల‌న చిత్రోత్స‌వాల‌లో ప్ర‌ద‌ర్శించ‌బ‌డ్డాయి. మైన‌ర్ బాలిక‌ల‌ను దేవాల‌యాల‌కు అప్ప‌గించాక

పూజాలు ఎలా దోపిడీ చేస్తారో చిత్రీక‌రించారు.

ఆ చిత్రం భారీ వివాదానికి దారి తీసింది. 2004లో లీనా ద‌ళిత మ‌హిళ‌ల‌పై తీసిన మ‌రో మూవీ వివాదంలో చిక్కుకుంది. 2011లో ధ‌నుష్కోడి లోని మ‌త్స్య‌కారుల క‌ష్టాల‌పై సెంగాడ‌ల్ అనే డాక్యుమెంట‌రీ చిత్రాన్ని రూపొందించింది.

సీబీఎఫ్‌సీతో కొట్లాడి విడుద‌ల‌య్యేలా చేసింది. ఆ చిత్రం అనేక అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల‌లో ప్ర‌శంస‌లు అందుకుంది. ఇదిలా

ఉండ‌గా ఆమె చేసిన ట్వీట్ల‌ను ట్విట్ట‌ర్ తొల‌గించింది.

Also Read : హిందూ జాగ‌ర‌ణ్ వేదిక క‌న్వీన‌ర్ పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!