Sridhar Vembu : ఎవరీ శ్రీధర్ వెంబు ఏమిటా కథ
పద్మశ్రీ అవార్డు గ్రహీత..బిలియనీర్
Sridhar Vembu : దేశ వ్యాప్తంగా శ్రీధర్ వెంబు చర్చనీయాంశంగా మారారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారత దేశానికి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త. జోహో కార్పొరేషన్ ఫౌండర్, సిఇఓ కూడా.
మొత్తం సంస్థకు సంబంధించి నికర విలువ $3.8 బలియన్లు. ఫోర్బ్స్ భారత దేశానికి చెందిన 100 మంది ధనవంతుల 2022 జాబితాలో 48వ స్థానంలో ఉన్నాడు. జోహో స్కల్ తన విద్యార్థులకు నేర్చుకునేందుకు రూ. 10,000 ఉపకార వేతనం అందిస్తుంది.
ఇది కేవలం ఇద్దరు టీచర్లు, ఆరుగురు పిల్లలతో ప్రారంభించారు. ఈ బడిలో 800 మందికి పైగా ఉన్నారు. 2022-23లో రూ. 2,700 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించింది శ్రీధర్ వెంబు(Sridhar Vembu) చైర్మన్ గా ఉన్న జోహూ కార్పొరేషన్.
జోహూ యూనివర్శిటీని కూడా నడుపుతున్నాడు. 12వ తరగతి పూర్తి చేసిన గణిత, సాంకేతిక నైపుణ్యాలను కలిగి ఉన్న విద్యార్థులకు శిక్షణను అందిస్తుంది. జోహూ కార్పొరేషన్ మే , 2022లో స్టార్టప్ జెన్ రోబోటిక్స్ లో $2.5 మిలియన్లను పెట్టుబడి పెట్టింది. ఇది మాన్యువల్ స్కావెంజింగ్ ను తొలగించేందుకు పరిష్కారాలపై పని చేస్తుంది.
శ్రీధర్ వెంబు తమిళనాడు లోని తంజావూరులో 1968లో పుట్టారు. ఆయన తండ్రి చెన్నై హైకోర్టులో స్టెనోగ్రాఫర్ గా పని చేశారు. ఆయన తల్లి గృహిణి. శ్రీధర్ వెంబు ప్రభుత్వ బడిలో చదివాడు. 1989లో ఐఐటీ మద్రాస్ లో ఇంజనీరింగ్ చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. 1994లో క్వాల్ కామ్ లో జాబ్ చేశాడు.
1996లో తన సోదరులతో కలిసి అడ్వెంట్ నెట్ అనే కంపెనీని ప్రారంభించారు. సాఫ్ట్ వేర్ సంస్థకు జోహో కార్పొరేషన్ గా మార్చారు. 2019లో అమెరికా నుంచి ఇండియాకు విచ్చేశారు. తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో తన ఆఫీసును ప్రారంభించాడు. గ్రామాలకు సాఫ్ట్ వేర్ అభివృద్దిని తీసుకు రావాలని భావించారు. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు.
మొత్తంగా శ్రీధర్ వెంబు(Sridhar Vembu) చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన భార్య చేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీధర్ వెంబు వైరల్ గా మారారు. ఆయన ఎవరు అని వెతకడం ప్రారంభించారు.
Also Read : అలుపెరగని యోధుడు శాంతి భూషణ్