దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు పాపల్ ప్రీత్ సింగ్. ప్రముఖ ఖలిస్తానీ ఉద్యమ నాయకుడు అమృతపాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే కేంద్రం ఫోకస్ పెట్టింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను టార్గెట్ చేశారు. ఎక్కడ ఉన్నా చంపుతానంటూ హెచ్చరించాడు. ఇదే సమయంలో మార్చి 18న తప్పించుకున్నాడు అమృత పాల్ సింగ్. అతడిని తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు పాపల్ ప్రీత్ సింగ్.
అతని సహచరులపై ఆపరేషన్ ప్రారంభించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అమృతపాల్ మద్దతుదారులు ఫిబ్రవరి 23న అమృత్ సర్ లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. అతడి సన్నిహుతుల్లో ఒకరైన లవ్ ప్రీత్ తూఫాన్ ను విడుదల చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఇదే సమయంలో అమృత పాల్ సింగ్ ను తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు పాపల్ ప్రీత్ సింగ్. అతడికి మెంటర్ గా ఉన్నాడు. ఇంజనీరింగ్ లో పోస్ట్ మెట్రిక్ డిప్లొమా కలిగి ఉన్నాడు . గత కొన్నేళ్లుగా డ్రగ్ వ్యతిరేక క్రూసేడర్ గా పని చేశాడు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉన్నాడు. ఖలిస్తానీ అనుకూల రచయితగా మారాడు.
అధికారికంగా అమృతపాల్ సింగ్ కు మీడియా సలహాదారుగా ఉన్నాడు. పాపల్ ప్రీత్ సింగ్ రాడికల్ , ఖలిస్తానీ కార్యకలాపాలలో పాల్గొనడం తో ఇంటెలిజెన్స్ ఏజెన్సీల రాడార్ లో ఉన్నాడు. అమృత్ పాల్ తో చేరక ముదు ఖలిస్తానీ వాదానికి మద్దతుగా ఉన్నాడు. సిమ్రంజీత్ సింగ్ మాన్ కు చెందిన శిరోమణి అకాలీ దళ్ , సిక్కు యూత్ ఫెడరేషన్ కు చెందిన బల్వంత్ సింగ్ గోపాల్ , సిక్కు యూత్ ఫ్రంట్ కు చెందిన శరంజింత్ సింగ్ రౌత్ లతో కలిసి సన్నిహితంగా పని చేశాడు.
ఇక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా వివిధ సిక్కు అనుకూల వెబ్ ఆధారిత ఛానెల్ లతో కలిసి పని చేశాడు. వారిస్ పంజాబ్ డి అవుట్ ఫిట్ ఫౌండర్ దీప్ సిద్దూకి మద్దతుదారుగా ఉన్నాడు పాపల్ ప్రీత్ సింగ్.