Vijayapriya Nithyananda : ఎవరీ విజయప్రియ ఏమిటా కథ
వరల్డ్ వైడ్ గా సంచలనం
Vijayapriya Nithyananda : సోషల్ మీడియా వచ్చాక అనామకులు సైతం సెలబ్రిటీలుగా మారి పోతున్నారు. ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకు జనం అంతగా ఇష్ట పడతారో కూడా చెప్పలేం.
తాజాగా లైంగిక, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని, అరెస్ట్ అయ్యాక దేశం నుంచి పారి పోయిన నిత్యానంద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ సకల భోగాలు అనుభవిస్తున్నాడు. నెట్టింటి వేదికగా నిత్యం తన కార్యక్రమాలను యధేశ్చగా ప్రచారం చేసుకుంటున్నా భారత దేశం ఏమీ చేయలేక పోతోంది.
ఇప్పటి వరకు నిత్యానందను అరెస్ట్ చేయలేక పోయింది. పాలకుల కారణంగానే ఈ వివాదాస్పద వ్యక్తి బయటకు వెళ్లాడనేది బహిరంగ రహస్యం.
తాజాగా తనను తాను కైలాసా దేశానికి శాశ్వత ప్రతినిధి అని చెప్పుకుంటున్న విజయ ప్రియ నిత్యానంద(Vijayapriya Nithyananda) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆమె ప్రస్తుతం అమెరికా లోని వాషింగ్టన్ డీసీలో నివసిస్తోంది. అయితే ఫుల్ టైమ్ గా నిత్యానందతోనే ఉంటోంది.
జెనీవాలో జరిగిన సాధారణ సమావేశంలో ఈ విజయ ప్రియ నిత్యానంద కైలాస పాల్గొంది. తన దేశం తరపున ఆమె పాల్గొంటున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
తమ స్వామి నిత్యానందను కొన్ని శక్తులు హింసించాయని ఆరోపించింది. చివరకు భారత్ అభ్యంతరం తెలపడంతో యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ వివరణ ఇచ్చు కోవాల్సి వచ్చింది. తాము కావాలని ఆమెను పిలవ లేదని పేర్కొంది.
విజయ ప్రియ నిత్యానంద చేసిన ప్రసంగాన్ని, ఆమె మాట్లాడిన మాటలను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
మాట్లాడేందుకు ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంతకూ విజయ ప్రియ(Vijayapriya Nithyananda) ఎవరని చూస్తే ఆమె అమెరికాలో ఉంటుందన్నది వాస్తవం. అక్కడి కల్చర్ కు కూడా అలవాటు పడింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమెనే స్వయంగా ఫేస్ బుక్ లో కూడా పెట్టింది. ప్రస్తుతం కైలాస దేశానికి శాశ్వత ప్రతినిధిగా తనను తాను పరిచయం చేసుకుంది ఈ సాధ్విమణి.
గత నెలలో జరిగిన సమావేశానికి హాజరైన విజయప్రియ నిత్యానంద ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. చివరకు విమర్శలు వెల్లువెత్తడంతో మాట మార్చింది.
భారత దేశం తమ కైలాస దేశానికి గురు పీఠం అని పేర్కొంది. మొత్తంగా మతం, దైవం పేరుతో దేశం నాశనం అవుతోందనడానికి నిత్యానంద ఓ ఉదాహరణ అని చెప్పక తప్పదు.
Also Read : భారత దేశం గురు పీఠం – విజయప్రియ