By Poll Results 2023 : ఉప ఎన్నికల్లో ఎవరిదో విజయం
5 రాష్ట్రాలలో కీలక ఫలితాలు
By Poll Results 2023 : ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయతో పాటు అరుణాచల్ ప్రదేశ్ , తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (By Poll Results 2023) వెలువడనున్నాయి.
ఆయా పార్టీలకు ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్ అని చెప్పక తప్పదు. త్రిపుర, నాగాలాండ్ లలో బీజేపీ మేఘాలయలో ఎన్పీపీ ఆధిక్యంలో ఉన్నా చివరి వరకు ఎవరికి మెజారిటీ దక్కుతుందనేది ఇంకా తేలలేదు. మధ్యాహ్నం లోపు పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న ఉప ఎన్నికలు ఆయా ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనంగా మారనున్నాయి. తమిళనాడులోని ఈరోడ్ లో గట్టి పోటీ నెలకొంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరిగింది.
ఇక అరుణాచల్ ప్రదేశ్ , జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ , తమిళనాడు, మహారాష్ట్ర లోని రెండు అసెంబ్లీ స్థానాలకు , మిగతా చోట్ల ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఇవాళ ప్రారంభమైంది.
తమిళనాడు లోని ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (By Poll Results 2023) మొత్తం 77 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ , ఏఐఏడీఎంకేకు చెందిన తెన్నరసు మధ్య ఉప ఎన్నిక ప్రధానంగా కనిపిస్తోంది. డీఎంకే మద్దతుతో కాంగ్రెస్ ఇక్కడ బరిలో నిలిచింది.
ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమహాన్ ఈవీరా మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మహారాష్ట్రలో చింద్వాడ్ , కస్పా పేట్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. బీజేపీ , మహా వికాస్ అఘాడీ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. చించ్ వాడ్ లో ఎన్సీపీ అభ్యర్థి విటల్ కేట్ , బీజేపీ అశ్విని జగ్తాప్ మధ్య పోటీ నెలకొంది.
పశ్చిమ బెంగాల్ లోని సాగర్ డిఘి ఎమ్మెల్యే సుబ్రతా సాహా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జార్ఖండ్ లోని రామ్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 18 మంది బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ నాయకురాలు మమతా దేవిపై అనర్హత వేటు వేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
Also Read : ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ