WI vs Scot T20 World Cup : పసికూన చేతిలో విండీస్ కు పరాభవం
స్కాట్లాండ్ చేతిలో 118 పరుగులకే ఆలౌట్
WI vs Scot T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ -2022 లో(WI vs Scot T20 World Cup) సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అనామాక జట్లు అని భావించిన నమీబియా ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టును మట్టి కరిపించింది. తాజాగా ఇవాళ జరిగిన కీలక మ్యాచ్ లో టైటిల్ ఫెవరేట్ గా ఉన్న వెస్టిండీస్ జట్టుకు చుక్కలు చూపించింది.
118 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది. క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది ఈ విజయం. విచిత్రం ఏమిటంటే రెండు సార్లు టి20 వరల్డ్ కప్ ను చేజిక్కించుకున్న చరిత్ర వెస్టిండీస్ ది. ఇటీవలే స్టార్ హిట్టర్ గా పేరొందిన విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఈసారి టైటిల్ ను తమ దేశం తప్పక గెలుస్తుందంటూ అంచనా వేశాడు. కానీ స్కాట్లాండ్ తో ఏ కోశాన వెస్టిండీస్ గట్టి పోటీ ఇవ్వలేక పోయింది. హోబర్ట్ వేదికగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగింది స్కాట్లాండ్ . నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
అనంతరం 161 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన విండీస్ ఏ కోశాన గట్టి పోటీ ఇవ్వలేక పోయింది. ప్రధానంగా స్కాట్లాండ్ బౌలర్లు రెచ్చి పోయారు. ఎక్కడా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు విండీస్ ను. విండీస్ ఓపెనర్లు మేయర్స్ 20 రన్స్ చేస్తే లూయిస్ 14 పరుగులు, బ్రాండన్ కింగ్ 17 రన్స్ మాత్రమే చేశారు.
ఇక జట్టులో ఉన్న పూరన్ 5, బ్రూక్స్ 4, పావెల్ 5, హుస్సేన్ 1, స్మిత్ 5, మెకాయ్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
Also Read : 15 లోగా రిటైన్ ఆటగాళ్ల జాబితా ఇవ్వాలి