BCCI Chetan Sharma Row : రాజీ పడతారా వేటు వేస్తారా
చేతన్ శర్మపై బీసీసీఐ కిం కర్తవ్యం
BCCI Chetan Sharma Row : భారత క్రికెట్ రంగంలో పెను సంచలనంగా మారారు చీఫ్ సెలెక్టర్ , భారత మాజీ క్రికెట్ స్టార్ పేసర్ చేతన్ శర్మ. భారత క్రికెట్ రంగంలో పెను సంచలనంగా మారారు చీఫ్ సెలెక్టర్ , భారత మాజీ క్రికెట్ స్టార్ పేసర్ చేతన్ శర్మ.
జీ న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో కీలక విషయాలు బయట పెట్టాడు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో కలకలం రేపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ వ్యవహారం. బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ , కార్యదర్శి జే షా తో పాటు బోర్డు ఇతర సభ్యులు సమావేశం అయ్యారు.
చేతన్ శర్మ(BCCI Chetan Sharma Row) వ్యవహారం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం చీఫ్ సెలెక్టర్ తో పాటు సభ్యులు కాంట్రాక్టు కింద ఉంటారు. ఈ సమయంలో బీసీసీఐకి సంబంధించి కానీ లేదా ఆటగాళ్ల గురించి కానీ ఎంపిక విషయం గురించి బయట మాట్లాడకూడదు.
అంతే కాదు బీసీసీఐకి సంబంధించిన సభ్యులు, సెలెక్టర్లు, ఆటగాళ్లతో మాట్లాడాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు బీసీసీఐ బాస్ గా ఉన్న సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ తరుణంలో చేతన్ శర్మ బహిరంగంగానే స్టింగ్ ఆపరేషన్ లో నోరు జారాడు. రూల్స్ ప్రకారం చేతన్ శర్మ(BCCI Chetan Sharma Row) భారత క్రికెట్ రంగంలో పెను సంచలనంగా మారారు చీఫ్ సెలెక్టర్ , భారత మాజీ క్రికెట్ స్టార్ పేసర్ చేతన్ శర్మ. ఉల్లంఘించాడు.
మరి చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సాహసిస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం తీవ్ర దుమారానికి దారి తీసిన ఈ వ్యవహారంపై ఒకింత సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
మరో వైపు కేంద్రం కూడా దీనిపై ఫోకస్ పెట్టినట్టు టాక్. ఒకవేళ చేతన్ శర్మపై వేటు వేస్తే బీసీసీఐలో చోటు చేసుకున్న లొసుగుల గురించి కూడా బయటకు పొక్కే ఛాన్స్ ఉందన్న భయం కూడా ఉంది. మరి బీసీసీఐ వేటు వేస్తుందా రాజీ పడనుందా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : భవిష్యత్తులో పాండ్యానే కెప్టెన్