Lendl Simmons : విండీస్ స్టార్ ఓపెన‌ర్ సిమ‌న్స్ గుడ్ బై

ఇన్ స్టా గ్రామ్ ద్వారా క్రికెట‌ర్ వెల్ల‌డి

Lendl Simmons : అంత‌ర్జాతీయ క్రికెట్ లో దిగ్గ‌జ ఆట‌గాళ్లు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఇద్ద‌రు స్టార్ క్రికెట‌ర్లు వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు.

ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ , ప్ర‌స్తుత ఇంగ్లండ్ జ‌ట్టు కెప్టెన్ బెన్ స్టోక్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. తాను వ‌న్డే మ్యాచ్ ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 2011లో వ‌న్డే, టి20 మ్యాచ్ ల‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ క్రికెట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

తాజాగా మ‌రో స్టార్ ప్లేయ‌ర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వెస్టిండీస్ విధ్వంస‌క‌ర‌మైన ఓపెన‌ర్ గా పేరొందిన లెండిల్ సిమ‌న్స్ తాను ఇక ఆడలేనంటూ వెల్ల‌డించాడు. త‌న నిర్ణ‌యాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

దీంతో విండీస్ అభిమానులు సిమ‌న్స్(Lendl Simmons) ఎందుకిలా చేశావంటూ ప్ర‌శ్నిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఇదిలా ఉండ‌గా సిమ‌న్స్ గ‌త ఏడాది టి20 ప్ర‌పంచ క‌ప్ లో చివ‌రి సారిగా విండీస్ త‌ర‌పున ఆడాడు.

2006లో పాకిస్తాన్ తో జ‌రిగిన వ‌న్డేలో విండీస్ త‌ర‌పున సిమ‌న్స్(Lendl Simmons) ఇంట‌ర్నేష‌న‌ల్ కెరీర్ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తో చివ‌రి మ్యాచ్ ఆడాడు. వ‌న్డేలు,

టెస్టుల్లో త‌న‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్న‌ సిమ‌న్స్ టి20ల‌లో విండీస్ కు టాప్ హిట్ట‌ర్ గా పేరొందాడు. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ తో జ‌రిగిన సెమీస్ లో సిమ‌న్స్ 82 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు. కెరీర్ లో 144 మ్యాచ్ లు ఆడి 3,763 ర‌న్స్ చేసి రికార్డు సృష్టించాడు.

Also Read : అజారుద్దీన్ ఓ నియంత అక్ర‌మాల పుట్ట

Leave A Reply

Your Email Id will not be published!