Immerse Medals : ప‌త‌కాలు కావవి మా ఆత్మ‌లు

కన్నీళ్లు పెట్టుకున్న మ‌హిళా రెజ్ల‌ర్లు

Immerse Medals : లైంగిక‌, మాన‌సిక‌, శారీర‌క వేధింపుల‌కు లోన‌వుతున్నామని భారత రెజ్ల‌ర్ల(Wrestlers) స‌మాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. మే 28న ఆదివారం నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం వ‌ర‌కు శాంతియుత మార్చ్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. భారీ ఎత్తున చేరుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు. 2 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌మ‌యంలో ఢిల్లీ ఖాకీలు విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడుల‌కు పాల్ప‌డ్డారు. అరెస్ట్ చేశారు. ఆపై కేసులు న‌మోదు చేశారు. మ‌హిళా రెజ్ల‌ర్ల(Wrestlers) ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీనిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. దీంతో తాము సాధించిన ప‌త‌కాల వ‌ల్ల ఒరిగింది ఏమీ లేద‌ని ఆవేద‌న చెందారు. ఆపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు అన్ని ప‌త‌కాల‌తో వారంతా హ‌రిద్వార్ లోని గంగా న‌ది వ‌ద్ద‌కు చేరుకున్నారు. వాటిని అందులో వేసి నిమ‌జ్జ‌నం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాచ‌రు. మ‌హిళా రెజ్ల‌ర్లు(Wrestlers) చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది. బాధిత మ‌హిళ‌ల‌కు బేష‌ర‌తు మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా నేత‌లు రాకేశ్ తికాయ‌త్ , త‌దిత‌రులు గంగా న‌ది వ‌ద్ద ఉన్న వారి వ‌ద్ద‌కు చేరుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ ప‌త‌కాలు మా ప్రాణాలు, మా ఆత్మ‌లు. ఇవాళ గంగ‌లో నిమ‌జ్జ‌నం చేసిన త‌ర్వాత బ‌త‌క‌డం స‌బ‌బు కాద‌ని , ఇండియా గేట్ వ‌ద్ద ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. పోలీసులు, వ్య‌వ‌స్థ మ‌మ్మ‌ల్ని నేర‌స్థులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయంటూ ఆవేద‌న చెందారు.

Also Read : Saamna

Leave A Reply

Your Email Id will not be published!