Wrestlers Protest : నార్కో టెస్టులకు మేం రెడీ – ఫోగట్
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సవాల్
Wrestlers Protest : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(brij bhushan sharan singh) విసిరిన సవాల్ కు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు రెజ్లర్లు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కీలక తీర్మానం చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(brij bhushan sharan singh) ను వెంటనే తొలగించాలని, ఆయనపై నార్కో టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతే కాకుండా వచ్చే ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ముందు ఆందోళన చేపడతామని పేర్కొన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. తాను నార్కో టెస్టు చేయించు కునేందుకు సిద్దంగా ఉన్నానని నాతో పాటు మహిళా రెజ్లర్లు వినీత్ ఫోగట్ , భజరంగ్ పునియా తో పాటు ఇతరులు కూడా నార్కో టెస్టుకు హాజరు కావాలని షరతు విధించారు. దీనిపై స్పందించారు మహిళా రెజ్లర్లు . దమ్ముంటే బహిరంగంగా నార్కో టెస్టుకు రావాలని , తాము కూడా సిద్దంగా ఉన్నామని సవాల్ విసిరారు. దీంతో రెజ్లర్ల నిరసన తారా స్థాయికి చేరుకుంది.
దేశం పరువు పోతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దేశం మొత్తం ఈ కామాంధుడి నిర్వాకం ఏమిటో తేలుతుందని సంచలన కామెంట్స్ చేశారు. దీనిని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని దేశం మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్
మిస్టర్ సింగ్ ఆదివారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఇద్దరు రెజ్లర్లు తమ పరీక్షను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే, “అప్పుడు ప్రెస్‌కి కాల్ చేసి ప్రకటించండి మరియు నేను కూడా దీనికి సిద్ధంగా ఉన్నానని వారికి వాగ్దానం చేస్తున్నాను” అని అన్నారు.
Also Read : CM Siddaramaiah