Womens T20 World Cup Australia : ఆసిస్ టీమ్ హాట్ ఫెవ‌రేట్

బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు

Womens T20 World Cup Australia : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న ఉత్కంఠ‌కు తెర ప‌డ‌నుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫిబ్ర‌వ‌రి 10న ప్రారంభం కానుంది. మొత్తం 10 టీమ్ లు ఆడ‌తాయి. ఈనెల 26న ఫైన‌ల్ జ‌రుగుతుంది. ఫ‌స్ట్ , సెకండ్ సెమీస్ ఉంటాయి. రిజ‌ర్వ్ డే లు కూడా ఏర్పాటు చేసింది ఐసీసీ. కేప్ టౌన్ ,పార్ల్ ,గ్కే బెర్హా స్టేడియంల‌లో మెగా టోర్నీ మ్యాచ్ లు కొన‌సాగుతాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా క్రికెట్ లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ టీమ్ గా పేరుంది ఆస్ట్రేలియాకు(Womens T20 World Cup Australia). అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో స‌త్తా చాటేందుకు రెడీ అయ్యారు అమ్మాయిలు. వారికి ఫీల్డింగ్ కూడా అద‌న‌పు బ‌లం గా మార‌నుంది. అందుకే ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్ త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఏ స‌మ‌యంలోనైనా స‌త్తా చాటే ఆట‌గాళ్లు క‌లిగి ఉంది ఈ టీమ్.

ఇక జ‌ట్టు విష‌యానికి వ‌స్తే ఇలా ఉంది. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌తో ఉన్నా వెంట‌నే ఆధిప‌త్యం చెలాయించేందుకు రెడీగా ఉంటారు ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్లు బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్, అలిస్సా హీలీ, డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, అలనా కింగ్ మరియు తహ్లియా మెక్‌గ్రాత్.

ఈ జ‌ట్టును త‌క్కువ అంచ‌నా వేసేందుకు వీలు లేదు. ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల లోనైనా ఎదుర్కొనే స‌త్తా ఉంది .

Also Read : జోరు మీదున్న పాకిస్తాన్

Leave A Reply

Your Email Id will not be published!