WPL 2023 RCB vs DC : ఢిల్లీ ఝలక్ బెంగళూరుకు షాక్
60 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
WPL 2023 RCBvsDC : తొలిసారిగా ముంబై వేదికగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ లో తొలి మ్యాచ్ లోనే స్మృతీ మంధాన సారథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమి పాలైంది.
టాస్ గెలిచిన మంధాన ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. కానీ తాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలింది. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్(WPL 2023 RCBvsDC) 223 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 163 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 60 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ కెప్టెన్ 7 మంది బౌలర్లను ప్రయోగించినా వికెట్లను కూల్చ లేక పోయారు. షఫాలీ వర్మ, కెప్టెన్ మెగ్ లానింగ్ దుమ్ము రేపారు.
10 ఓవర్లలోనే 100 పరుగులు దాటించారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షఫాలీ వర్మ 84 రన్స్ చేస్తే కెప్టెన్ లానింగ్ 72 పరుగులతో సత్తా చాటింది. దీంతో భారీ స్కోర్ నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
ఇదే జట్టులోని ఎడమ చేతి వాటం పేస్ బౌలర్ తారా నోరిస్ ఐదు వికెట్లు తీసింది. ఆర్సీబీ పతనాన్ని శాసించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 రన్స్ కే పరిమితమైంది.
మరో వైపు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాప్ లో కొనసాగుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే షఫాలీ వర్మ 45 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు నాలుగు సిక్సర్లు కొట్టింది. లానింగ్ 43 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు సాధించింది.
వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 162 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇదే అతి పెద్ద భాగస్వామ్యం . ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ హీతర్ నైట్ ఇద్దరీని ఔట్ చేసింది.
Also Read : ప్లీజ్ కోహ్లీతో పోల్చకండి – మంధాన