WPL TATA : టాటా చేతికి మహిళల ప్రీమియర్ లీగ్
మొదటి సీజన్ హక్కులకు ఓకే
WPL TATA : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మార్చిలో నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు సంబంధించి ప్రముఖ దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఇప్పటికే గణనీయమైన ఆదాయాన్ని గడించింది బీసీసీఐ. షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. మొత్తం ఐదు సీజన్లకు కూడా టాటా గ్రూప్(WPL TATA) స్పాన్సర్ గా ఉండనుంది. వచ్చే 2027 సంవత్సరం జూలై వరకు టాటా టైటిట్ స్పాన్సర్ గా కొనసాగుతుంది.
ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జే షా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక రిచ్ లీగ్ కు సంబంధించి మహిళల ప్రీమియర్ లీగ్(WPL TATA) మార్చి 4న ముంబైలో ప్రారంభం కానుంది. టాటా గ్రూప్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇదే మద్దతుతో దేశంలో మహిళా క్రికెట్ మరింత ముందుకు సాగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు జే షా. కాగా మెన్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కూడా టాటా గ్రూప్ స్వొంతం చేసుకుంది.
మరో వైపు డబ్ల్యూపీఎల్ మీడియా హక్కులను 5 సంవత్సరాల కాలానికి వైకోమ్ (రిలయన్స్ గ్రూప్ ) కు బీసీసీఐ అప్పగించింది. దీంతో భారీ ఎత్తున బీసీసీఐకి ఆదాయం సమకూరింది. ఇప్పటికే మహిళల వేలం పాట ముగిసింది. ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది స్మృతీ మంధాన. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.40 కోట్లకు చేజిక్కించుకుంది. ప్రస్తుతానికి ఐదు జట్లు డబ్ల్యూపీఎల్ లో ఆడనున్నాయి.
Also Read : 23న ఆసిస్ భారత్ సెమీస్