Satya Nadella Bing AI : బింగ్ షాక్ ఇవ్వడం ఖాయం – సిఇఓ
సత్య నాదెళ్ల సంచలన కామెంట్స్
Satya Nadella Bing AI : మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) అనేది కీలకంగా మారిందని, తమ సంస్థ డెవలప్ చేసిన సెర్చింగ్ ఇంజిన్ బింగ్(Satya Nadella Bing AI) త్వరలోనే గూగుల్ కు పోటీ కానుందని ప్రకటించారు. ఇటీవల చాట్ జీపీటి దుమ్ము రేపుతోంది. టెక్నాలజీలో సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా గూగుల్ ను వెతుకుతారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.
చాట్ జీపీటి వచ్చాక ప్రతి ఒక్కరు దానిలోనే సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ముందు నుంచి సెర్చింగ్ సెక్టార్ లో గూగుల్ రారాజుగా వెలుగొందుతోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ కు చెందిన సెర్చింగ్ ఇంజిన్ బింగ్ కు చాట్ జీపీటిని జత చేస్తే కావాల్సిన సమాచారం క్షణాల్లో వచ్చేలా చేస్తోంది. దీంతో రాను రాను గూగుల్ కు ప్రయారిటీ తగ్గుతుందని సత్య నాదెళ్ల(Satya Nadella) భావిస్తున్నారు.
సెర్చింగ్ కు సంబంధించి బయటి వెబ్ సైట్ లకు తెలిసిన లింక్ ల జాబితాకు బదులుగా బహుళ మూలాలను ఉపయోగించి రెడీమేడ్ సమాధానాలను అందించడం ద్వారా సమూలంగా అప్ డేట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ అంచనా వేస్తోంది. బింగ్ సెర్చ్ ఇంజన్ భాషా ఆధారిత కృత్రిమ మేధస్సు శక్తివంతమైన సామర్థ్యాలను ఏకీకృతం చేస్తుందని సిఇఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.
ఆన్ లైన్ శోధనకు కొత్త యుగం ప్రారంభం కాబోతోందన్నారు సిఇఓ. సెర్చ్ కి ఇది కొత్త రోజు. రేసు ఈరోజు నుంచి ప్రారంభం అవుతుందన్నారు.
Also Read : ఆమె నాకు స్పూర్తి దిక్సూచి