Anand Mahindra Sania Mirza : ఆమె నాకు స్పూర్తి దిక్సూచి

సానియా మీర్జా పై వ్యాపార దిగ్గ‌జం ప్ర‌శంస‌ల జ‌ల్లు

Anand Mahindra Sania Mirza : భార‌తీయ వ్యాపార దిగ్గ‌జాల‌లో మోస్ట్ పాపుల‌ర్ బిజినెస్ మెన్ ఎవ‌రైనా ఉన్నారంటే అది మ‌హీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra). ఆయ‌న త‌న ప‌నుల్లో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు.

అంతే కాదు ట్విట్ట‌ర్ లో నిత్యం త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటారు. ప్ర‌తి సోమ‌వారం ఒక స్పూర్తి దాయ‌క‌మైన క‌థ‌ను లేదా వ్య‌క్తుల‌ను ప‌రిచ‌యం చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు.

తాజాగా ఆనంద్ మ‌హీంద్రా చేసిన కామెంట్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత పాపుల‌ర్ గా మారాయి. త‌న జీవిత కాలంలో చాలా మంది త‌న‌ను ప్ర‌భావితం చేశార‌ని కానీ ఎక్కువ‌గా స్పూర్తి పొందింది మాత్రం హైద‌రాబాద్ కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అని పేర్కొన్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్ప‌డంలో అంద‌రికంటే ముందుంటారు ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra).

ఆమెలో త‌న‌కు ప్ర‌త్యేకంగా న‌చ్చిన విష‌యం ఏమిటంటే ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఉండ‌డం. చివ‌రి దాకా పోరాడ‌టం. ఓట‌మి పొందినా నిరాశ ప‌డ‌క పోవ‌డం. విజ‌యం సాధించాల‌నే క‌సి..ఆక‌లి త‌న‌ను ఎంత‌గానో ఇన్ స్పైర్ చేసింద‌ని పేర్కొన్నారు వ్యాపార‌వేత్త‌.

ఈ సంద‌ర్బంగా ఆనంద్ మ‌హీంద్రా చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది. సానియా మీర్జా త‌న ఆట జీవితాన్ని ప్రారంభించిన విధంగానే ముగించింద‌ని పేర్కొన్నారు. నా కెరీర్ లో ఈ ద‌శ‌లో కూడా రాణించాల‌నే కోరిక‌ను స‌జీవంగా ఉంచు కోవాల‌ని త‌న‌కు గుర్తు చేసిందంటూ కితాబు ఇచ్చారు.

Also Read : ఇంధ‌నం దేశానికి అవ‌స‌రం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!