Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డ్
1000 రన్స్ పూర్తి చేసిన క్రికెటర్
Yashasvi Jaiswal : రాజస్థాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈసారి లీగ్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. జట్టులో అత్యధిక రన్స్ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 1,000 రన్స్ చేశాడు. నాలుగు అంకెల మార్క్ ను సాధించాడు. 2020లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉండగా యశస్వి జైస్వాల్ వేయి పరుగులను 34 ఇన్నింగ్స్ లలో సాధించాడు.
అంతే కాదు 1000 రన్స్ చేసిన అతి పిన్న వయస్సు కలిగిన రెండో క్రికెటర్ గా కూడా ఘనత సాధించాడు జైస్వాల్. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ స్కిప్పర్ రిషబ్ పంత్ పేరుతో రికార్డ్ నమోదైంది. ఆ తర్వాత యశస్వి ఈ ఘనతను నమోదు చేశాడు. జైశ్వాల్ 21 ఏళ్ల 130 రోజులకు వేయి రన్స్ చేస్తే పంత్ 20 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించాడు.
ఇక ఐపీఎల్ 16వ సీజన్ లో ఇప్పటి దాకా 11 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 477 రన్స్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 511 రన్స్ చేసి ముందంజలో ఉంటే రెండో స్థానంలో కొనసాగుతున్నాడు యశస్వి జైస్వాల్.
ఇక 1,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల్లో పూర్తి చేస్తే జైశ్వాల్ 21 ఏళ్ల 130 రోజులు, పృథ్వీ షా 21 ఏళ్ల 169 రన్స్ , సంజూ శాంసన్ 21 ఏళ్ల 183 రోజులు, శుభ్ మన్ గిల్ 21 ఏళ్ల 222 రోజుల్లో వేయి పరుగులు పూర్తి చేశారు.
Also Read : చితక్కొట్టిన శుభ్ మన్ గిల్