Yashasvi Jaiswal : హోరెత్తించిన యశస్వి జైశ్వాల్
ఐపీఎల్ లో మారథాన్ ఇన్నింగ్స్
Yashasvi Jaiswal : ఒకప్పుడు పానీ పూరి అమ్మిన యశస్వి జైశ్వాల్ తనకు ఎదురే లేదని చాటాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తగ్గలేదు. ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ ను ఓడించినా నిజమైన హీరోగా నిలిచాడు జైశ్వాల్.
కళ్లు చెదిరే షాట్స్ , బుల్లెట్ లాంటి బంతుల్ని అవలీలగా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. పరుగుల వరద పారించాడు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 212 పరుగులు చేస్తే ఒకే ఒక్కడు జైశ్వాల్ చేసిన స్కోర్ 124 రన్స్.
ఐపీఎల్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఐపీఎల్ లో ఇది 1,000వ మ్యాచ్ . చరిత్రాత్మకమైన మ్యాచ్ లో యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. కేవలం 62 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఒకానొక దశలో ముంబై ఇండియన్స్ కు ముచ్చెమటలు పట్టించాడు.
ఇరు జట్లు కలిసి 400 పరుగులు చేశాయి. రాజస్థాన్ 212 రన్స్ చేస్తే ముంబై 213 పరుగులు చేసి లక్ష్యాన్ని ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. జోస్ బట్లర్ తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు యశస్వి జైశ్వాల్. తొలి రెండు ఓవర్లలో కెమెరూన్ గ్రీన్ , జోఫ్రా ఆర్చర్ లకు షాక్ ఇచ్చాడు. సిక్స్ కొట్టి ప్రారంభంలోనే దూకుడు పెంచాడు. 11వ ఓవర్ లో జైస్వాల్ పీయూష్ చావ్లాను ఫోర్ కొట్టి నాలుగో ఫిఫ్టీని పూర్తి చేశాడు.
Also Read : మెరిసిన లియామ్ లివింగ్ స్టోన్