Rajapaksa Brothers : నిన్న యుద్ధ వీరులు నేడు విలన్లు
శ్రీలంక సంక్షోభం వెనుక కన్నీటి కథ
Rajapaksa Brothers : శ్రీలంకలో రావణ కాష్టం మళ్లీ మొదలైంది. ప్రశాంతంగా ఉన్న దేశం ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. ఆర్థిక, ఆహార, విద్యుత్, గ్యాస్ సంక్షోభం తీవ్ర సమస్యగా నెలకొంది.
ఈ తరుణంలో నిన్నటి దాకా రక్తంతో తడిసిన ఈ నేల మళ్లీ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతోంది. ఒకప్పుడు ఎల్టీటీఈని మట్టుబెట్టిన విజేతగా పేరొందిన రాజపక్సే కుటుంబం ఊహించని రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది.
నిన్నటి దాకా ఆ కుటుంబానికి జేజేలు పలికిన జనం ఇప్పుడు కనిపిస్తే చంపేస్తామంటూ హెచ్చరించే స్థాయికి దిగజరారు గోటబయ రాజపక్సే, మహీందా రాజపక్సే. 2013లో జరిగిన విజయోవత్సవ పరేడ్ కు హాజరైనప్పుడు మహీందకు మద్దతు లభించింది.
కానీ ఆర్థిక సంక్షోభం పెచ్చరిల్లడంతో ఉన్నట్టుండి జనం రోడ్ల పైకి వచ్చారు. దేశం నాశనం కావడానిక రాజపక్సే కుటుంబమే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. జనం మొదట ప్రధానిగా ఉన్న మహీంద భవనాన్ని ముట్టడించారు.
దెబ్బకు పారి పోయాడు మహీందా. నేవీ ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు. శ్రీలంక సుప్రీంకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది దేశం విడిచి వెళ్లవద్దంటూ ఆదేశించింది.
ఇదే సమయంలో ప్రధాని స్థానంలో విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించినా పరిస్థితిలో మార్పు రాలేదు. కాగా అధ్యక్షుడిగా ఉన్న తన సోదరుడు
గోటబయ కు షాక్ తగిలింది.
ఆయన భవనాన్ని జనం ముట్టడించారు. దీంతో ఆయన కూడా పారి పోయాడు. ఆర్మీ సహకారంతో మాల్దీవులకు చెక్కేశాడు. అంత్యరుద్దంలో గెలిచినందుకు హీరోలుగా కీర్దించబడ్డారు రాజపక్సే సోదరులు(Rajapaksa Brothers).
కానీ వారిప్పుడు దూషణలకు గురవుతున్నారు. కనిపిస్తే చంపేందుకు రెడీగా ఉన్నారు ప్రజలు. దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసేందుకు
సోదరులు కారణమని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
2009లో తమిళ టైగర్లను అణిచి వేసినందుకు మహీందకు జేజేలు పలికిన జనం ఇప్పుడు ఛీదరించుకుంటున్నారు. ప్రజలు పాలకులను
తరిమి కొట్టేందుకు రెడీగా ఉన్నారు.
ఒక దశాబ్దానికి పైగా ఎలంక రాజకీయాలను శాసిస్తూ వచ్చిన కుటుంబానికి ఇది నాటకీయ పతనం అని చెప్పక తప్పదు. మహీంద సోదరుడు
గోటబయను రక్షణ కార్యదర్శిగా చేశాడు. క్రూరుడిగా పేరొందాడు.
Also Read : తుపాకుల మోత కనిపిస్తే కాల్చివేత