Youtuber: పాకిస్థాన్ గూడచర్యం క్రింద హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

పాకిస్థాన్ గూడచర్యం క్రింద హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

 

 

హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్‌ లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురి అరెస్ట్‌ను చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్‌ కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా… ఇటీవల ట్రావెల్‌ వీసాపై పాకిస్థాన్‌ లో రెండుసార్లు పర్యటించారు. పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కలిసిన జ్యోతి మల్హోత్రా… ఆ దేశానికి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెట్‌వర్క్‌ హర్యానా, పంజాబ్‌ అంతటా విస్తరించినట్లు తేలింది. వీరంతా పాక్‌ ఐఎస్‌ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా… ‘ట్రావెల్‌ విత్‌ జో’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతోంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్‌ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌ తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.

 

డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.

 

ఈ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్‌ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్‌ అనే పాకిస్థాన్‌ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన జ్యోతి.. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో కూడా పర్యటించింది. పాక్ ఇంటలిజెన్స్ అధికారితో సన్నిహిత పెంచుకుని ఇద్దరూ ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు.

Leave A Reply

Your Email Id will not be published!