YS Jagan Sensation : జ‌’గ‌న్’ సెన్సేష‌న్

మొండి ఘ‌టం

YS Jagan Sensation : సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు ఇవాళ‌. మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు జ‌గ‌న్ . చాలా మంది పూర్తి పేరు కంటే జ‌గ‌న్ అంటేనే ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తారు. తాత రాజారెడ్డి, తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూనే త‌న‌దైన ముద్ర క‌నబ‌రుస్తూ వ‌చ్చారు. తండ్రి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప‌వ‌ర్ ఉప‌యోగించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కానీ అనూహ్యంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం తీవ్ర విషాదాన్ని క‌లుగ చేసింది. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ రెడ్డి(YS Jagan) ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు జైలు పాల‌య్యారు. ఆపై విడుద‌ల‌య్యారు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. స‌క్సెస్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్ గా స‌క్సెస్ అయ్యాడు.

ఇదంతా అంద‌రికీ తెలిసిన క‌థే. కానీ ఒక మ‌నిషి ఒక స్థాయికి చేరుకోవాలంటే ఎంత‌గా క‌ష్ట ప‌డాలో జ‌గ‌న్ ను చూసి నేర్చుకోవాలి. ఓ వైపు అంతులేని ఆస్తులు..ఇంకో వైపు అవినీతి ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు..కేసులు..వీట‌న్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డిన ఘ‌న‌త జ‌గ‌న్ ది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న అభిమానులు జ‌గ‌న్ ను జ‌గ‌మొండి అంటారు.

యూత్ లో ఆయ‌న‌కు ఎన‌లేని ఫాలోయింగ్ ఉంది. వారంతా జ‌గ‌న్(YS Jagan) ను గ‌న్ (తుపాకి)గా పిలుచుకుంటారు. జ‌గ‌న్ ఎక్కువ‌గా మాట్లడ‌రు. మాట్లాడేందుకు కూడా ఇష్ట‌ప‌డరు. ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాల‌నే త‌త్వం ఆయ‌న‌ది. త‌న‌ను కాద‌నుకున్న వాళ్లు, త‌న‌ను గేలి చేసిన వాళ్లు, త‌ను చెర‌సాల పాలైన స‌మ‌యంలో న‌వ్విన వాళ్లు , త‌న‌ను టార్గెట్ చేసిన వాళ్లు..అంద‌రినీ త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు.

విజ‌యంత‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో జ‌గ‌న్ చేపట్టిన పాద‌యాత్ర జ‌గ‌న్ ను విజేత‌గా నిల‌బ‌డేలా చేసింది. జ‌నంతో క‌ల‌వ‌డం వ‌ల్ల తాను ఎంతో నేర్చుకునేలా చేసిందంటాడు. అందుకే ఊహించ‌ని రీతిలో ఏపీ రాష్ట్ర చ‌రిత్ర‌లో అత్య‌ధిక సీట్ల‌ను తెచ్చుకునేలా చేసింది.

ఈ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది మాత్ర‌మే జ‌గ‌న్ రెడ్డినే. ఆయ‌న చిటికేస్తే చాలు త‌న కోసం ప్రాణం తీసుకునే వాళ్లు కోకొల్ల‌లు ఉన్నారు. ఆయ‌నంటే పిచ్చి..త‌న తండ్రి లాగే..జ‌గ‌న్ రెడ్డికి మాటివ్వ‌డం త‌ప్ప‌డం ఇష్టం ఉండ‌దు. ఒక్క‌సారి ఫోక‌స్ పెట్టాడంటే అది కావాల్సిందే..లేదా రాజీకి రావాల్సిందే.

చాలా మంది ఆయ‌న‌ను ఇంట్రావ‌ర్ట్ అంటారు. కానీ ఇంకొంద‌రు మాత్రం అనుకున్నంత అమాయ‌కుడు కాదంటారు. ఎందుకంటే ఏదైనా తెలుసు కోవాల‌ని అనుకుంటే ముందు తాను ప్రిపేర్ అవుతాడ‌ని, నోట్స్ రాసుకుంటాడ‌ని ఓ సీనియ‌ర్ రిటైర్డ్ అధికారి స్ప‌ష్టం చేశారు.

ఇదంతా ప‌క్క‌న పెడితే ఆయ‌న‌కు 49 ఏళ్లు. ప్ర‌స్తుతం ఏపీకి సీఎంగా ఉన్నారు. న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించాడు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగం, మ‌హిళా సాధికార‌త‌, ఉపాధి వీటినే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశ‌గా సాగి పోతున్నాడు. ఏది ఏమైనా జ‌గ‌న్ ఓ సెన్సేష‌న్ కాదంటారా.

Also Read : ఈడీ చార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ క‌విత

Leave A Reply

Your Email Id will not be published!