YS Sharmila: డీఎస్సీ నోటిఫికేషన్ పై జగన్ కు వైఎస్ షర్మిల 9 ప్రశ్నలు !
డీఎస్సీ నోటిఫికేషన్ పై జగన్ కు వైఎస్ షర్మిల 9 ప్రశ్నలు !
YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)… అధికార వైసీపీపై మాట యుద్ధం కొనసాగిస్తోంది. తన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీను దగా డిఎస్సీ అంటూ ఎద్దేవా చేసారు. అంతేకాదు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తే…. ఆయన వారసుడని చెప్పుకునే వైఎస్ జగన్ కేవలం 6వేల పోస్టులతో డీఎస్సీ ఇచ్చాడని… మరి ఇది దగా డీఎస్సీ కాక మరేంటని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నేతలకు, వాళ్లను మోసే సోషల్ మీడియా సిబ్బందికి ఇదే నా సవాల్ అంటూ తొమ్మిది ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సామాజిక మాధ్యమాల వేదికగా తొమ్మిది ప్రశ్నలను సంధించారు. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగనన్న, ఆయన చుట్టూ ఉండే మంత్రులందరూ ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి ? అని షర్మిల సవాల్ విసిరారు.
YS Sharmila – షర్మిల సంధించిన 9 ప్రశ్నలివే…
1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?
2. ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ?
3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యమేంటి ?
4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?
5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధి మాత్రమేనా?
6. వైఎస్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా?
7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?
8. రోజుకు 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?
9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష సాధింపు చర్య కాదా?
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా ! హెలీకాప్టర్ ల్యాండింగ్ నో పర్మిషన్ ?