YS Sharmila TSPSC : షర్మిల టీఎస్ పీఎస్సీ ఆఫీస్ ముట్టడి.. పరిస్థితి ఉద్రిక్తం
YS Sharmila TSPSC : టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యమే అని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్టీపి అధినేత్రి వైఎస్ షర్మిల టీఎస్ పీఎస్సీ(YS Sharmila TSPSC) ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కేసులో చిన్న చిన్న వారిపై కేసులు పెడుతున్నారు.
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేది పోయి అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ముట్టడికి పిలుపు నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద బలగాలు మోహరించారు.
ముట్టడిలో భాగంగా అక్కడకు చేరుకున్న షర్మిలను మహిళా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆమె అక్కడే రోడ్డు మీద బైఠాయించారు. అయితే చివరకు ఆమెను అతి కష్టం మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనితో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులు భారీగా రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ YSRTP పార్టీ ఇవాళ టీఎస్ పీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వగా..ముందు నుంచి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. కానీ ఆమె అక్కడకు చేరుకొని రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా 40 మందిని పైగా అధికారులు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త డాక్వా నాయక్ తో సంబంధాలున్న వారందరిని సిట్ పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నారు.
ఇక తాజాగా షమీమ్, రమేష్, సురేష్ లను 5 రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. పేపర్ లీక్ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని గుర్తించారు. రేణుక భర్త డాక్వా నాయక్ బ్యాంకు ఆర్ధిక లావాదేవీలను పరిశీలించిన పోలీసులు కీలక విషయాలు గుర్తించారు.
రేణుక భర్త డాక్వా నాయక్ డబ్బుల వసూలులో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఏఈ పేపర్ లీక్ తో డాక్వా నాయక్ ఏకంగా రూ.25 లక్షలను వసూలు చేసినట్టు గుర్తించారు. నీలేష్, గోపాల్ నాయక్ లు పొలం తాకట్టు పెట్టి రూ.13.5 లక్షలను డాక్వా నాయక్ కు అందించినట్లు సిట్ గుర్తించింది.
అలాగే రాజేందర్ అనే యువకుడు కూడా రూ.5 లక్షలు, శ్రీకాంత్ అనే వ్యక్తి రూ.7.5 లక్షలను డాక్వా నాయక్ కు ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నారని సిట్ తెలిపింది. మరి వెరీ కస్టడీకి ఇంకా సమయం ఉండడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : దేశవ్యాప్తంగా బాగా పెరిగిన కరోనా కేసులు..