YS Sharmila Dharna: విశాఖలో వైఎస్ షర్మిల మెరుపు నిరసన !
విశాఖలో వైఎస్ షర్మిల మెరుపు నిరసన !
YS Sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విశాఖలో మెరుపు నిరసన చేపట్టారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం మంగళవారం విశాఖ చేరుకున్న షర్మిల… అస్సాంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై జరిగిన దాడికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అస్సాం ప్రభుత్వం వెంటనే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు. అస్సాంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో న్యాయ యాత్రకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు వ్యక్తం చేశారు. షర్మిలతో పాటు సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అంతకుముందు ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా విశాఖ వచ్చిన వైఎస్ షర్మిలకు… కాంగ్రెస్(Congress) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశాఖ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్టు నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న వైఎస్ షర్మిల… కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
YS Sharmila Dharna Viral
ఈ సందర్భంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మాట్లాడుతూ… భారత్ జూడో న్యాయ యాత్రలో భాగంగా అస్సాంలో పాద యాత్ర చేపడుతున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై… అక్కడి బిజేపీ ప్రభుత్వం దాడి చేసే ప్రయత్నం చేస్తుందని ఆరరోపించారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వమే ఉందని… గుడికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రజల కోసం, ప్రశాంతంగా యాత్ర చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా… దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు. బీజేపీకి చెందిన పార్టీలు వ్యక్తులు మాత్రమే ఉండాలా… మరెవ్వరు ఉండకూడదా అని ప్రశ్నించారు. గుడికి వెళ్లడానికి కూడా మోదీ అనుమతి కావాలా అని ప్రశ్నించారు. దేశంలో నీచమైన పాలన చేస్తుందని మండిపడ్డారు.
Also Read : Heroin in Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హెరాయిన్ పట్టివేత !