YSRCP 6th List: వైసీపీ ఆరో జాబితా విడుదల !

వైసీపీ ఆరో జాబితా విడుదల !

YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైసీపీ(YSRCP) అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తుంది. దీనితో భాగంగా ఆరో జాబితాను వైసీపీ నేత, మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు. ఈ ఆరో విడత జాబితాలో… నాలుగు ఎంపీ స్థానాలకు, ఆరు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ ఛార్జిలను ప్రకటించారు. ఆరో జాబితా విడుదల చేసే క్రమంలో… పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ని అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు రీజినల్ కో ఆర్డినేటర్‌గా పార్టీ అధిష్టానం నియమించింది. అలాగే.. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, అసెంబ్లీ నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను) ను డిప్యూటీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా నియమించింది.

YSRCP – ఆరో జాబితాలో ఇన్ చార్జిలు వీరే !

పార్లమెంట్ ఇంఛార్జిలు..

రాజమండ్రి.. గూడూరి శ్రీనివాస్
నర్సాపురం.. అడ్వకేట్ గూడూరి ఉమాబాల
గుంటూరు.. ఉమ్మారెడ్డి వెంకటరమణ
చిత్తూరు.. ఎన్.రెడ్డప్ప

అసెంబ్లీ ఇంఛార్జిలు..

మైలవరం.. తిరుపతిరావు యాదవ్
మార్కాపురం.. అన్నా రాంబాబు
గిద్దలూరు.. నాగార్జున రెడ్డి
జీడీ నెల్లూరు .. నారాయణ స్వామి
నెల్లూరు సిటీ .. ఎండీ ఖలీల్(డిప్యూటీ మేయర్)
ఎమ్మిగనూరు.. బుట్టా రేణుక

వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా… 61 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ ఛార్జిలను మార్చేసింది. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 10 స్థానాలకు(4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది. తాజాగా ఆరో జాబితాలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో ఆరో జాబితాతో కలిసి మొత్తం ఇప్పటివరకు 82 స్థానాల్లో ఇన్ చార్జిలను మారుస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Also Read : Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకు అరెస్ట్ వారెంట్ !

Leave A Reply

Your Email Id will not be published!