YSRCP 8th List: వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల !
వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల !
YSRCP 8th List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైసీపీ(YSRCP) అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తుంది. దీనితో భాగంగా ఎనిమిదో జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేసింది. ఈ ఎనిమిదో విడత జాబితాలో… రెండు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను ప్రకటించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎనిమిదో జాబితాను విడుదల చేయడం… అందులో మాగుంట ప్లేస్ లో చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నియమించడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
YSRCP 8th List – ఎనిమిదో జాబితాలో ఇన్ చార్జిలు వీరే !
పార్లమెంట్ ఇంఛార్జిలు..
గుంటూరు.. కిలారి రోశయ్య
ఒంగోలు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అసెంబ్లీ ఇంఛార్జిలు..
పొన్నూరు.. అంబటి మురళి
కందుకూరు.. బుర్రా మధుసూదన్ యాదవ్
గిద్దలూరు.. నాగార్జున రెడ్డి
జీడీ నెల్లూరు .. కల్లత్తూర్ కృపాలక్ష్మి
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల చేర్పులు మార్పులు చేస్తూ వైసీపీ అధిష్టానం ఇంతవరకు ఎనిమిది జాబితాలను విడుదల చేసింది. అయితే ఇటీవల ఆ పార్టీ కీలకనేత, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఇటీవల నియోజకవర్గాల్లో నియమిస్తున్న సమన్వయకర్తలు… వచ్చే ఎన్నికలకు పార్టీ అభ్యర్ధులు కారని అన్నారు. అయితే వైవీ సుబ్బారెడ్డి మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే మంగళగిరిలో బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల జాబితా దాదాపు ఖరారు అయినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మరల సమన్వయకర్తలను నియమిస్తూ ఎనిమిదో జాబితాను విడుదల చేయడం పట్లు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది.
Also Read : MP Magunta Sreenivasulu Reddy: వైసీపీకు ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా !