Yuzvendra Chahal Dhanasree : ‘చాహ‌ల్..ధ‌న‌శ్రీ’ హ‌ల్ చ‌ల్

విడి పోతున్నారంటూ వెల్లువెత్తిన పుకార్లు

Yuzvendra Chahal Dhanasree : ప్ర‌ముఖ భార‌త క్రికెట‌ర్ , స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ టూర్ ముగించుకుని ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. గ‌త కొన్ని రోజులుగా భార్య ధ‌న‌శ్రీ చాహ‌ల్(Yuzvendra Chahal Dhanasree) మ‌ధ్య భేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, వారిద్ద‌రూ విడి పోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ధ‌న‌శ్రీ త‌న అధికారిక ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా సుదీర్ఘ లేఖ రాసింది. తామిద్ద‌రినీ మ‌ర‌ణం త‌ప్ప ఇంకెవ‌రూ విడదీయ లేరంటూ స్ప‌ష్టం చేసింది.

గ‌త కొంత కాలంగా తాను డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలో కాలు బెణికింద‌ని దీంతో తాను న‌డ‌వ‌లేని స్థితిలోకి వెళ్లి పోయాన‌ని వాపోయింది.

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తాను తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాన‌ని, నిరాశ‌లో ఉన్న స‌మ‌యంలో త‌న భ‌ర్త చాహ‌ల్ , కుటుంబీకులు త‌నకు చేదోడుగా నిలిచారంటూ కితాబు ఇచ్చింది.

రోజు రోజుకు తామిద్ద‌రిని టార్గెట్ చేస్తూ వ‌స్తున్న స‌మ‌యంలో, త‌రుణంలో ఈ ఇద్ద‌రూ క‌లుసు కోవ‌డం విస్తు పోయేలా చేసింది. తాజాగా త‌న టూర్ ముగించుకుని ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు యుజ్వేంద్ర చాహ‌ల్.

భ‌ర్త రాక కోసం ధ‌న‌శ్రీ ఆస‌క్తిగా ఎదురు చూసింది. భ‌ర్త చేతిని త‌న చేతిలో ప‌ట్టుకోవ‌డం, ఇద్ద‌రూ ఆలింగ‌నం చేసుకోవ‌డం మ‌రింత విస్తు పోయేలా చేసింది. పుకార్ల‌కు చెక్ ప‌డింది.

కెమెరాలు క్లిక్ మ‌నిపించాయి. ప్ర‌స్తుతం ఎయిర్ పోర్ట్ లో క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ , భార్య ధ‌న‌శ్రీ క‌లిసి ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : కోహ్లీ ఫామ్ లోకి వ‌స్తే ఆప‌డం క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!