#RamMandir : రామమందిర నిర్మాణానికి రూ 10 లక్షలు అందించిన చైర్మన్ సుబ్బారెడ్డి
Ram Mandir : అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహకారం అందించాలని విశ్వహిందూ పరిషత్,ఆరెస్సెస్ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కోరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లి లోని తన నివాసంలో
Ram Mandir : అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహకారం అందించాలని విశ్వహిందూ పరిషత్,ఆరెస్సెస్ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కోరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లి లోని తన నివాసంలో విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాందే తో పాటు పలువురు చైర్మన్ ను కలిశారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహాయం అందించే విషయం బోర్డ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ వారికి చెప్పారు. రామ మందిర నిర్మాణానికి శ్రీ సుబ్బారెడ్డి తన వంతుగా రూ 10 లక్షలు విరాళం చెక్కును వారికి అందించారు.
విశ్వహిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి కేశవ్ హెగ్డే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎస్ నాయుడు,ఆరెస్సె ప్రతినిధులు శ్రీనివాసరాజు, దుర్గా ప్రసాద్ చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.

No comment allowed please