#UgadiContest : ఉగాది బాలల కథల పోటీకి ఆహ్వానం
Ugadi Contest : ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఉదేశ్యం తో సిద్దిపేట జిల్లా లోని ప్రభుత్వ ,మోడల్ ,రెసిడెన్షియల్ మరియు ప్రయివేటు
Ugadi Contest : ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఉదేశ్యం తో సిద్దిపేట జిల్లా లోని ప్రభుత్వ ,మోడల్ ,రెసిడెన్షియల్ మరియు ప్రయివేటు పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులనుండి కథలను ఆహ్వానిస్తున్నామని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రథమ బహుమతి 1500 రూపాయలు,ద్వితీయ బహుమతి 1000 రూపాయలు, రెండు తృతీయ బహుమతులు500 రూపాయలు చొప్పున మరియు 300 రూపాయలు చొప్పున 9 ప్రత్యేక బహుమతులను ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణారెడ్డి అందిస్తున్నారు.
హామీ పత్రంతో పాటు విద్యార్థులు తాము వ్రాసిన కథలను “కన్వీనర్, ఉగాది కథల పోటీ,ప్రతిభ డిగ్రీ కళాశాల, మెదక్ రోడ్ సిద్దిపేట-502103 చిరునామా కు 2021 ఫిబ్రవరి 10వ తేదీలోగా స్వయంగా,రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపగలరు.పూర్తి వివరాలకు 9959007914 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చు నని తెలిపారు.

No comment allowed please