Zelensky : ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) తన పంతం వీడడం లేదు. ఇప్పటికీ రోజులు గడుస్తున్నా బాంబుల మోత మోగుతూనే ఉంది. కానీ ఇరు దేశాలు మంకు పట్టు వీడడం లేదు. ఓ వైపు శాంతి చర్చలు అంటూనే ఇంకో వైపు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
ఏకపక్ష దాడులకు పాల్పడుతున్న రష్యా (Russia) అది యుద్దం కాదని బుకాయిస్తోంది. సైనిక చర్య పేరుతో రంగంలోకి దిగింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.
కానీ కించిత్ కనికరం చూపడం లేదు పుతిన్ (Putin) . ఐక్య రాజ్య సమితి , బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ యుద్దాన్ని ఆపాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్ సైతం ఈ ఘోరాన్ని తాను చూడలేనంటూ వాపోయాడు.
వీలైతే తనకు ప్రోటోకాల్ కూడా అక్కర్లేదని, మాస్కోకు వస్తానని చెప్పాడు. కానీ పుతిన్ (Putin) చూసీ చూడనట్లు ఉండి పోయాడు. రష్యా (Russia) తన పంతాన్ని వీడడం లేదు. శాంతి చర్చల్లో పాల్గొంటూనే దాడులకు తెగ బడుతోంది.
టర్కీ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కొద్దిగా పురోగతి కనిపించింది. రష్యా కైవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి రపిస్తామంటూ తెలిపింది.
రష్యా మాటల్ని తాము నమ్మడం లేదంటూ ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ(Zelensky) ఆరోపించాడు. 34 రోజుల యుద్దంలో భయంకరమైన విధ్వంసాన్ని చూశామన్నాడు.
ఉక్రెయిన్లు అమాయకులు కారని వారికి ఎలా పోరాడాలో బాగా తెలుసన్నాడు. తటస్థ వైఖరి అవలంభించినంత మాత్రాన యుద్దం నిలిచి పోయినట్లు కాదన్నాడు.
Also Read : ఇమ్రాన్ దమ్ముంటే అధికారం నిలబెట్టుకో