Zomato CEO Donates : జొమాటో సిఇఓ రూ. 700 కోట్ల విరాళం
వ్యాపారవేత్తలకు ఐఐటీయన్ ఆదర్శం
Zomato CEO Donates : చేతిలో కోట్లు ఉంటే ఏం లాభం పది మందికి ఉపయోగ పడాలి. దేశంలో ఎందరో కుబేరులు ఉన్నారు. అంతకు మించిన ధనవంతులు లేక పోలేదు. కానీ వచ్చిన ఆదాయంలో అత్యధిక శాతం సమాజ సేవకు వినియోగించే వాళ్లలో కొందరు మాత్రమే ఉన్నారు. వారిలో అజీమ్ ప్రేమ్ జీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా , తదితరులు జాబితాలో కొలువు తీరారు. తాజాగా జొమాటో సిఇఓ(Zomato CEO Donates) దీపిందర్ గోయల్ సంచలనంగా మారారు. ఏకంగా తనకు వచ్చిన దాంట్లోంచి రూ. 700 కోట్లు విరాళంగా ఇచ్చాడు.
ఆయన ఢిల్లీ ఐఐటీలో పూర్వ విద్యార్థి కావడం విశేషం. 568 మిలియన్ డాలర్లకు జొమాటో కొనుగోలు చేసింది బ్లింకెట్ కంపెనీని. ఇప్పటికే చెఫ్ కార్ట్ అనే కంపెనీ ద్వారా హోమ్ చెఫ్ సేవలను అందిస్తోంది. దీపిందర్ గోయల్ 2008లో జొమాటోను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన తన కంపెనీలో 5.5 శాతం వాటాను కలిగి ఉన్నాడు. సిఇఓ అర్బన్ కంపెనీ బోర్డుకు రాజీనామా చేశాడు. జొమాటో యాజమాన్యం లోని బ్లింకెట్ కంపెనీ హోమ్ సేవల విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నాడు.
దీపిందర్ గోయల్ మార్చి 2022లో కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా నియమితులయ్యారు. రూ. 346.6 కోట్ల నష్టాన్ని చవి చూసింది. నష్టాలు ఉన్నా రాబోయే ఏడెనిమిది ఏళ్లల్లో జొమాటోను(Zomato CEO) బిలియన్ డాలర్ల ప్లస్ కంపెనీగా మార్చాలని చూస్తున్నాడు. దీపిందర్ గోయల్ 2020లో 7.7 శాతం నుండి 2022లో 5.5 శాతానికి తగ్గించాడు.
గోయల్ పంజాబ్ లో పుట్టాడు. అతడి పేరెంట్స్ టీచర్స్. 2005లో ఐఐటీ ఢిల్లీలో చదివాడు. దేశ రాజధాని ఢిల్లీ లోని బెయిన్ అండ్ కంపెనీలో పని చేశాడు. మెనూ కార్డ్ లకు డిమాండ్ ఉందని గుర్తించాడు. 2008లో ఫూడిబే అనే స్టార్టప్ ను ప్రారంభించాడు. 2010లో దానికి జొమాటో అని పేరు పెట్టాడు. డెలివరీ భాగస్వాముల కోసం రూ. 700 కోట్లు విరాళంగా ప్రకటించాడు. ఇలాంటి వాళ్లే ఈ దేశానికి కావాల్సింది. ఇకనైనా జొమాటో సిఇఓను మిగతా వ్యాపారవేత్తలు ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం.
Also Read : ఎవరీ విజయప్రియ ఏమిటా కథ