Jeevitha Rajasekhar : జీవిత..రాజశేఖర్ కు 1 సంవత్సరం జైలు శిక్ష
బెయిల్ మంజూరు కు ఛాన్స్
Jeevitha Rajasekhar : తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటీ నటులు జీవిత, రాజశేఖర్ కు బిగ్ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆ ఇద్దరికీ ఏడాది జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. 17వ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్షతో పాటు జీవిత, రాజశేఖర్(Rajasekhar) లకు రూ. 5 వేల జరిమానా విధించింది.
ఇదిలా ఉండగా 2011వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకుపై సంచలన ఆరోపణలు చేశారు జీవిత, రాజశేఖర్. ఆనాడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు.
Jeevitha Rajasekhar To
ఇదిలా ఉండగా చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు అందిస్తున్న సేవలపై అసత్య ఆరోపణలలు చేశారంటూ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు నాంపల్లి కోర్టులో.
జీవిత, రాజశేఖర్ లకు సంబంధించిన కేసుకు సంబంధించి కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా సినీ నటులు చేసిన ఆరోపణలు కావాలని, వ్యక్తిగతంగా డ్యామేజ్ కలిగించేలా ఉన్నాయంటూ ధర్మాసనం పేర్కొంది. ఇంకొక సారి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎటువంటి ఆరోపణలు చేయకూడదంటూ మందలించింది. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. కాగా బెయిల్ మంజూరుకు అనుమతి ఇచ్చింది కోర్టు.
Also Read :Jay Shah Grand Wishes : హ్యాపీ బర్తడే బాస్ – జే షా