న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో 20 శాతం అద‌నంగా ఏర్పాట్లు

వెల్ల‌డించిన టీటీడీ చీఫ్ ఇంజినీర్ మ‌నోహ‌రం

తిరుమ‌ల : శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు తిరుమ‌లలో 20 శాతం అద‌నంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు టీటీడీ చీఫ్ ఇంజినీర్ మ‌నోహ‌రం తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా -2 లోని మీడియా సెంట‌ర్ లో శ‌నివారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. శ్రీ‌వారి ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌గ‌డ్భందీగా ఏర్పాటు చేశామ‌ని అన్నారు. మాడ వీధుల్లో రంగ‌వ‌ల్లుల‌ను అత్యంత సుంద‌రంగా పెయిటింగ్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. శ్రీ‌వారి పుష్క‌రిణిలో నూత‌నంగా ఎస్ఎస్ రెయిలింగ్ చేసిన‌ట్లు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా అద‌నంగా 120 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచామ‌ని వెల్ల‌డించారు. నందకం విశ్రాంతి భ‌వ‌నం వ‌ద్ద ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయ‌డంతో ట్రాఫిక్ త‌గ్గింద‌ని తెలియ‌జేశారు. తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా పార్కింగ్ చేసి బస్సుల్లో తిరుమలకు రావడంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్పారు.

ఎల‌క్ట్రిక‌ల్ ఎస్ఈ వేంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ తిరుమ‌ల‌లో విద్యుత్ అలంక‌ర‌ణ‌ల‌ను అత్యంత శోభాయ‌మానంగా తీర్చిదిద్దిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలో వాహ‌న సేవ‌ల‌ను భ‌క్తులు ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. ఎస్ఈ వేణుగోపాల్ మాట్లాడుతూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఎప్ప‌టికప్పుడు అన్ని ఇంజినీరింగ్ ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో పార్కింగ్ స్థ‌లాల‌ను ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎల‌క్ట్రిక‌ల్ డిఈ చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఆల‌య ప్రాకారానికి ప్ర‌త్యేక విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేశామ‌ని చెప్పారు. ఆల‌యానికి ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ‌నివాస క‌ల్యాణం, శ్రీ‌రామ ప‌ట్టాభిషేక ఘ‌ట్టం, నాలుగు యుగాల కాన్సెప్ట్ తో రూపొందించిన‌ విద్యుత్ అలంక‌ర‌ణల‌కు భ‌క్తుల నుండి విశేస ప్ర‌శంస‌లు వ‌చ్చాయ‌ని తెలిపారు. విద్యుత్ విభాగం సిబ్బంది మూడు నెల‌ల పాటు శ్ర‌మించి తిరుమ‌ల‌లో విద్యుత్ అలంక‌ణ‌లు చేప‌ట్టార‌ని తెలిపారు.

ఈఈ శ్రీ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ మాడ వీధుల్లో ఎగ్జిట్ పాయింట్ల‌ను వెడ‌ల్పు చేయ‌డంతో వాహ‌న సేవ‌లు వీక్షించిన అనంత‌రం భ‌క్తులు సౌక‌ర్య‌వంతంగా వెలుప‌ల‌కు వ‌చ్చార‌ని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!