బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఆస్ప‌త్రిలో చేరిక‌

న్యూఢిల్లీ లోని ప్ర‌ధాన ఆస్ప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లింపు

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ అగ్ర నాయ‌కుడు, కురు వృద్దుడిగా పేరు పొందిన లాల్ కృష్ణ అద్వానీ శ‌నివారం అనుకోకుండా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. ఆయ‌న ప్ర‌స్తుతం వ‌య‌సు 98 ఏళ్లు. దీంతో హుటా హుటిన‌ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు సమాచారం. అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి, బీజేపీని భారతదేశంలో అధికారానికి ప్రధాన పోటీదారుగా మార్చడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం ప్ర‌స్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆయన నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం రాత్రి సుమారు 7:30 గంటలకు ఆయన ఆసుపత్రిలో చేరారు. పార్లమెంటులో అద్వానీ చేసే ప్రసంగాలు ఎంతో ప్రభావవంతంగా ఉండేవి, అందుకే ఆయన అనేకమంది పార్లమెంటేరియన్లకు ఆదర్శంగా నిలిచారు.

ఏదైనా చర్చలో పాల్గొనే ముందు, తన వాదనలకు మద్దతుగా తేదీలు, గణాంకాలతో కూడిన సమగ్రమైన నోట్స్‌ను సిద్ధం చేసుకోవడానికి ఆయన పార్లమెంటు లైబ్రరీలో రెండు నుండి మూడు గంటల సమయాన్ని కేటాయించేవారు. ఆయనకు ‘భారతరత్న’, ‘పద్మవిభూషణ్’ పురస్కారాలతో పాటు, 1999లో ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ అవార్డు కూడా లభించింది .. ఎల్ కే అద్వానీ పలుమార్లు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు .2002 నుండి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అయోధ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం నుండి అయోధ్య వరకు ‘రామ్ రథ యాత్ర’ను చేపట్టారు. అయితే, బీహార్‌లో ఈ యాత్రను అడ్డుకున్న అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, 1990 అక్టోబర్‌లో అద్వానీని సమస్తిపూర్‌లో అరెస్టు చేయించారు. ఆయన కేంద్ర సమాచార , ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

Leave A Reply

Your Email Id will not be published!