PAK Journalist Slaps : చెంప ఛెళ్లుమనిపించిన పాక్ జర్నలిస్ట్
అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడికి షాక్
PAK Journalist Slaps : పాకిస్తాన్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వార్తా సేకరణలో భాగంగా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ ) జరుగుతున్న సమయంలో ఓ బాలుడు చేసిన పనికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు చెంది ఓ లేడీ జర్నలిస్ట్.
చెంప దెబ్బ కొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొంత మంది ఆమెకు మద్దతు పలుకుతుండగా మరికొందరు ఆమె చేసిన పని బాగోలేదంటూ పేర్కొన్నారు ట్వీట్లతో.
కానీ ఎక్కువ శాతం నెటిజన్లు మాత్రం లేడీ జర్నలిస్ట్(PAK Journalist Slaps) మరియా హష్మి చేసింది మంచిదేనంటూ ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. తాను చేసిన పనికి పెద్ద ఎత్తున దుమారం లేవడం, చర్చకు దారి తీయడంతో మరియా హష్మి స్పందించింది.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను చేసింది ముమ్మాటికీ కరెక్టేనంటూ స్పష్టం చేసింది. ఈ ఘటన చోటు చేసుకుంది ఈనెల 9న ఆదివారం రోజున.
ఈద్ అల్ అధా సెలవు దినం గురించి మరియా హష్మీ నివేదిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారంలో. జర్నలిస్ట్ చుట్టూ లైవ్ లో అక్కడికి చెందిన మహిళలు, పిల్లలు గుమిగూడారు.
తెల్లటి చొక్కా ధరించిన యువకుడు పదే పదే అడ్డు పడుతుండడంతో ఇబ్బంది పడిన జర్నలిస్ట్ చెంప ఛెళ్లుమనిపించింది. ఈ సందర్భంగా ఆ బాలుడు ఓ కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ తెలిపింది మరియా హష్మీ.
ఇదిలా ఉండగా మరియా హష్మీకి ఏకంగా 9,800 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read : గోటబయ వెళ్లేందుకు సపోర్ట్ చేయలేదు
یہ لڑکا انٹرویو کے دوران فیملی کو تنگ کر رہا تھا _جسکی وجہ سے فیملی پریشان ہوگئی تھی__میں نے پہلے پیار سے سمجھایا کے ایسا نہیں کرو مگر سمجھانے کے باوجود یہ لڑکا نہیں سمجھا اور زیادہ ہُلّڑ بازی کررہا تھا_ جس کے بعد مجھے زیب نہیں دیا کہ اسے اور موقع دیکر برداشت کیا جائے ؟ pic.twitter.com/4jmuSsInYg
— Maira Hashmi (@MairaHashmi7) July 11, 2022