Sushmita Sen Dating : ప‌లువురితో డేటింగ్ సుస్మితా సేన్ స్పెష‌ల్

హాట్ టాపిక్ గా మారిన ల‌లిత్ మోదీ..సేన్

Sushmita Sen Dating : క్రీడా, సినిమా రంగాల‌కు చెందిన వారు ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటారు. ఈ రెండు రంగాలు అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి.

గ‌తంలో సినీ రంగానికి చెందిన హీరోయిన్లు క్రికెట‌ర్ల‌తో అఫైర్లు న‌డ‌ప‌డం మామూలే. బీసీసీఐ చీఫ్ , ఒక‌ప్ప‌టి మాజీ కెప్టెన్ గంగూలీ న‌గ్మా వ్య‌వ‌హారం అప్ప‌ట్లో హ‌ల్ చ‌ల్ చేసింది.

ఇక భార‌త జ‌ట్టు స్టైలిష్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్, సంగీతా బిజ్ లానీ కొన్నాళ్ల పాటు పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత విడి పోయారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు.

తాజాగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు జీవం పోసి, అవినీతి ఆరోప‌ణ‌ల‌తో దేశానికి రాకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ల‌లిత్ మోదీ నెట్టింట్లో వైర‌ల్ గా మారారు.

ఆయ‌న న‌టి సుస్మితా సేన్ తో డేటింగ్ లో ఉన్నాన‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కాగా సుస్మితా క్లారిటీ ఇచ్చింది పెళ్లి చేసు

కోలేద‌ని కానీ ప్రేమ‌లో ఉన్నామ‌ని తెలిపింది.

ఇక సుష్మితా సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే ల‌లిత్ మోదీ కంటే ముందే ఆమె మ‌రికొంద‌రితో డేటింగ్ చేసింది. ఆమెకు 10 మందితో ట‌చ్ లో ఉంది.

కొన్ని నెల‌ల కింద‌టే రోహ్ మ‌న్ షాల్ తో కంటిన్యూ అయ్యింది. ప్ర‌స్తుతం 46 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ న‌టి చాలా మందితో కంటిన్యూ చేయ‌లేక

పోయింది. ఆమ‌ధ్య ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ తో ఎఫైర్ ఉన్న‌ట్లు పుకార్లు వ‌చ్చాయి.

విక్ర‌మ్ ను పెళ్లి చేసుకుంది. దూర‌మైంది. పాకిస్తాన్ మాజీ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్ తో కూడా ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింది. ఇక మ‌రో న‌టుడు

దీప‌క్ హూడా మూడేళ్ల పాటు సుస్మితా సేన్ తో డేటింగ్(Sushmita Sen Dating) లో ఉన్నారు.

హాట్ మెయిల్ ఫౌండ‌ర్ ష‌బ్బీర్ భాటియాతో కూడా సుస్మితా సేన్ ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింది. హృతిక్ భాసిన్ తో నాలుగేళ్ల పాటు కొన‌సాగింది.

సంజ‌య్ నారంగ్ తో పెళ్లి దాకా వ‌చ్చి ఆగి పోయింది.

సెల‌బ్రిటీ మేనేజ‌ర్ బంటీ స‌జ్జేహ్ తో బంధం కొన‌సాగింది. త‌న‌కంటే 14 ఏళ్లు చిన్న వాడైనా ఇంతియాజ్ ఖ‌త్రీ అనే వ్యాపార‌వేత్త‌తో ప్రేమ‌లో పింది.

రోహ్మాన్ తో విడి పోయాక ఇప్పుడు ల‌లిత్ మోడీతో కొత్త వ్య‌వ‌హారం న‌డుపుతోంది.

Also Read : లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ‌

Leave A Reply

Your Email Id will not be published!