Murali Sri Shankar : లాంగ్ జంప్ లో ఫైనల్ కు చేరిన శ్రీశంకర్
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో
Murali Sri Shankar : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ పోటీల్లో భారత దేశానికి చెందిన అథ్లెట్ లాంగ్ జంపర్ మురళీ శ్రీంకర్ పురుషుల ఫైనల్స్ కు ప్రవేశించాడు. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.
జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పతకాలు సాధించిన ఈ లాంగ్ జంపర్ లాంగ్ జంప్ లో డార్క్ హార్స్ గా నిలిచాడు. గత ఏప్రిల్ లో ఫెడరేషన్ కప్ లో తన 8.36 మీటర్ల ప్రయత్నంతో సీజన్ లీడర్లలో రెండో స్థానంలో ఉన్నాడు.
తాజాగా జరిగిన పోటీల్లో మురళీ శ్రీ శంకర్(Murali Sri Shankar) 8 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో పురుషుల విభాగంలో ఫైనల్ కు అర్హత సాధించాడు. హీట్స్ లో ఏడో స్థానంలో నిలిచాడు.
ఈ పోటీలో ఫైనల్ కు చేరిన ఏకైక భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు ఇప్పటికే. జెస్విన్ ఆల్డిన్ , ముహమ్మద్ అనీస్ యాహియా పోటీలో ఉన్నా వారు అర్హత సాధించ లేక పోయారు.
టాప్ -12 లో చేరలేదు. కానీ మురళీ శ్రీ శంకర్ ఫైనల్ కు చేరడం తో క్రీడా లోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా లాంగ్ జంప్ విభాగంలో 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తున్నాడు.
గ్రీస్ లో జరిగిన ఒక ఈవెంట్ లో జాతీయ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్ లో 8.23 మీటర్ల ఎత్తుతో బంగారు పతకాన్ని సాధించాడు.
ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటాడు. కాగా మురళీ శ్రీ శంకర్ 27 మార్చి 1999లో పుట్టాడు.
Also Read : విరాట్ కోహ్లీపై కపిల్ దేవ్ సెటైర్