Lalit Modi : ఇండియాకు ఐపీఎల్ గిఫ్ట్ గా ఇచ్చా – లలిత్ మోదీ
తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
Lalit Modi : తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ(Lalit Modi) . ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశాడు. ఇండియాకు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ను బహుమతిగా ఇచ్చానని, ఆ సంతృప్తి తనకు చాలన్నాడు.
కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని కానీ అందులో వాస్తవం లేదన్నారు. ముందు వాస్తవం తెలుసు కోకుండా ఆరోపణలు చేయడం మాను కోవాలని సూచించాడు .
తాను నటి సుస్మితా సేన్ తో ప్రేమలో ఉన్నట్టు పేర్కొనడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించాడు లలిత్ మోదీ. తన భార్య మోనాల్ గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఆరోపించాడు.
ప్రేమకు వయస్సు అన్నది అడ్డంకి కాదని పేర్కొన్నాడు. నెల్సన్ మండేలా లేటు వయస్సులో పెళ్లి చేసుకోలేదా అని ప్రశ్నించాడు. ప్రస్తుతం సుస్మితా సేన్ తో తాను ప్రేమలో ఉన్నట్లు బహిరంగంగానే ప్రకటించాడు.
ఆ మేరకు తామిద్దరు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక లలిత్ మోదీ(Lalit Modi) చేసిన కామెంట్స్ అటు క్రీడా ఇటు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇదిలా ఉండగా మండేలా, దలైలామా, మోదీ, అమిత్ షా , తదితర ప్రముఖులతో ఉన్న ఫోటోలను ఈ సందర్భంగా షేర్ చేశాడు లలిత్ మోదీ.
మనమంతా ఇంకా మధ్య యుగంలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే నేరం ఎలా అవుతుందంటూ ప్రశ్నించాడు.
తాను ఆర్థిక నేరగాడిని కాదన్నాడు. పుట్టుకతో బంగారు స్పూన్ తో పుట్టానని చెప్పాడు.
Also Read : సేమ్ సీన్ విరాట్ కోహ్లీ పరేషాన్