Salman Khan : సల్మాన్ ఖాన్ కు ఆయుధాల లైసెన్స్
ప్రాణ భయం ఉందంటూ అభ్యర్థన
Salman Khan : జింకను చంపిన కేసులో జైలుకు వెళ్లి ఆపై బెయిల్ పై విడుదలైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఎట్టకేలకు ఆయుధాల లైసెన్స్ మంజూరైంది.
ఎవరైనా తనను బెదరించినా లేదా విమర్శించినా లేదా దాడికి పాల్పడే ప్రయత్నం చేసినా తను వారిపై యధేశ్చగా కాల్పులు జరిపేందుకు బహిరంగంగానే లైసెన్స్ మంజూరు చేసింది కేంద్ర సర్కార్ సారథ్యంలోని హోం మంత్రిత్వ శాఖ.
ఇప్పటికే జింకను చంపిన దాంట్లో సల్మాన్ ఖాన్ పాత్ర ఉందంటూ నిప్పులు చెరుగుతున్నాడు ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ఏదో ఒకరోజు చంపి తీరుతానంటూ శపథం చేశాడు.
నీళ్లు తాగినంత సులభంగా మర్డర్లు చేసే గ్యాంగ్ ను నడుపుతున్న ఈ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ కు సల్మాన్ ఖాన్(Salman Khan) ను చంపాలన్నది కోరిక. ఇద్దరికీ వైరం ఏమీ లేదు.
పోనీ ఆస్తి తగాదాలు కూడా లేవు. కానీ ఉన్నదల్లా ఒక్కటే తాను ప్రాణ ప్రదంగా ప్రేమించే జింకను వేటాడి చంపాడన్న కోపం కసిగా మారింది.
దీంతో సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన తండ్రి సలీం ఖాన్ ను కూడా చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీని ఆధారంగా సల్మాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. చివరకు తనకు ప్రాణ భయం ఉందంటూ ఆత్మ రక్షణ కోసం తనకు ఆయుధాలు కలిగి ఉండేందుకు లైసెన్స్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు.
ఎంతైనా మనోడు నటుడు కదా అందుకనే ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంటే యధేశ్చగా జంతువుల్ని, మనుషుల్ని చంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్ అన్నమాట.
Also Read : బాలీవుడ్ కు ఢోకా లేదు – కరణ్ జోహార్