Saif Al Adel : అల్ ఖైదా చీఫ్ రేసులో సైఫ్ అల్ అడెల్
యుఎస్ దాడుల్లో అల్ జవహిరి హతం
Saif Al Adel : ప్రపంచ ఉగ్రవాదిగా పేరొందిన అల్ ఖైదా చీఫ్ అల్ జవహిరి ని యుఎస్ దళాలు మట్టుబెట్టాయి. ఈ ఉగ్రవాద సంస్థను బిన్ లాడెన్ తో పాటు మరికొందరు ఏర్పాటు చేశారు.
1988 నుండి 2011 దాకా లాడెన్ చీఫ్ గా ఉన్నాడు. అదే ఏడాది పాకిస్తాన్ లో లాడెన్ ను తుద ముట్టించింది యుఎస్ దళం. అమెరికాపై దాడుల
తర్వాత 10 ఏళ్లకు లాడెన్ ను ఖతం చేసింది.
అనంతరం 21 ఏళ్ల తర్వాత తాజాగా అల్ జవహిరిని హతం చేసింది. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో తలదాచుకున్నట్లు గుర్తించింది. డ్రోన్ లతో
దాడికి పాల్పడింది.
ఈ విషయాన్ని అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ ప్రకటించారు అధికారికంగా. ఇదిలా ఉండగా మరో టెర్రరిస్టును మోస్ట్ డేంజరస్ గా ప్రకటించింది యుఎస్.
అతడే అల్ ఖైదాకు సెక్యూరిటీ చీఫ్‌గా ఉన్న సైఫ్ అల్ అడెల్(Saif Al Adel). అతడే తదుపరి చీఫ్ గా ఎంపికవుతాడని భావిస్తోంది. జవహిరిని చంపేయడంతో ఉగ్రవాదులు మరింత రెచ్చి పోయే అవకాశం ఉందని అనుమానిస్తోంది.
ఒక రకంగా అల్ ఖైదా సంస్థకు పెద్ద దెబ్బగా భావించక తప్పదు. బదులు తీర్చుకున్నామంటూ బైడన్ ప్రకటించాడు. ఈ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యేంత వరకు ఎవరికీ తెలియనివ్వలేదు అమెరికా.
విచిత్రం ఏమిటంటే ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు సైతం సమాచారం లేదు. అయితే దాడిని మాత్రం తీవ్రంగా ఖండించింది.
ఇక మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ అంచనా ప్రకారం సైఫ్ అల్ అడెల్ కే ఎక్కువగా ఛాన్స్ ఉందని చీఫ్ అయ్యేందుకు. ఈజిప్టు మాజీ ఆర్మీ ఆఫీసర్. అల్ ఖైదా వ్యవస్థాపక సభ్యుడు.
యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం 1980లో టెర్రర్ గ్రూప్ లో చేరాడు. అదే ఏడాది ఆఫ్గనిస్తాన్ లో రష్యా దళాలతో పోరాడాడు. లాడెన్ కు
సెక్యూరిటీ చీఫ్ గా ఉన్నాడు.
2001 నుండి ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. అతడిపై $10 మిలియన్ల రివార్డు ప్రకటించింది అమెరికా. ఎంబసీలను టార్గెట్
చేయడం, బాంబుల మోత మోగించడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. అమెరికా ఇప్పుడు వేట కొనసాగిస్తోంది.
Also Read : అల్ జవహరి హతం తాలిబన్ ఆగ్రహం