FIFA Suspends : అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్యపై వేటు
తక్షణమే అమలులోకి వస్తుందన్ని ఫిఫా
FIFA Suspends : అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్యకు కోలుకోలేని షాక్ తగిలింది. అనవసరమైన ప్రలోభాలకు గురి చేసిందన్న ఆరోపణలపై ఫిఫా కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అపెక్స్ ఫుట్ బాల్ బాడీ ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ని(FIFA Suspends) సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం ఆగస్టు 16 నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
అధికారికంగా ధ్రువీకరించింది ఫిఫా. ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. మితిమీరిన జోక్యం, ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.
ఇది ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. అనుచిత ప్రభావం కారణంగా ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తన అధికారిక మీడియా ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉండగా ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటీ కమిటీ అధికారాలు రద్దు చేయబడ్డాయి. పూర్తి నియంత్రణలోకి తీసుకు వచ్చేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా ఈ సస్పెన్స్ ప్రభావం భారత్ లో నిర్వహించ తలపెట్టిన వరల్డ్ కప్ కూడా జరిగే అవకాశం లేదని ఫిఫా సూచన ప్రాయంగా తెలిపింది.
ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 11-30 తేదీలలో భారత దేశంలో జరగాల్సి ఉంది. ఈ సస్పెండ్ దెబ్బకు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది ఫిఫా.
ఇదిలా ఉండగా ఫుట్ బాల్ సమాఖ్య కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంది. సాధ్యమైనంత మేరకు సంప్రదింపులు జరపనుంది.
Also Read : టీమిండియా ‘మేరా భారత్ మహాన్’