Jayam Ravi : నేడు జీ 5 ఓటిటిలో రానున్న ‘కోమాలి’
Jayam Ravi: లాక్‌డౌన్‌లో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు… ‘అమృతం ద్వితీయం’ వెబిసోడ్స్‌తో వీక్షకులను ఎంటర్టైన్ చేస్తూ తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో పాటు , వెబ్ సిరీస్, వెబ్ షోలతో అలరిస్తున్న ఓటీటీ వేదిక ‘జీ 5’.
Jayam Ravi: లాక్‌డౌన్‌లో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు… ‘అమృతం ద్వితీయం’ వెబిసోడ్స్‌తో వీక్షకులను ఎంటర్టైన్ చేస్తూ తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో పాటు , వెబ్ సిరీస్, వెబ్ షోలతో అలరిస్తున్న ఓటీటీ వేదిక ‘జీ 5’.తో తాజాగా తమిళ హీరో ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘కోమాలి’ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది.
డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా లో పదహారేళ్లు కోమాలో ఉండిపోయిన జయం రవికి స్కూల్ డేస్ లో హీరోని ప్రేమించిన సంయుక్తా హెగ్డే మరొకరిని పెళ్లి చేసుకుని కనిపిస్తుంది. పదహారేళ్ల క్రితం సమాజంలో పరిస్థితులేంటి మారిన పరిస్థితులకు కథానాయకుడు అలవాటు పడ్డాడా? అన్న కథాంశంతో ఈ ‘కోమాలి’ రూపొందిందని ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని ‘జీ 5’ వర్గాలు తెలియజేశాయి.
‘జయం’ రవి , కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో కమెడియన్ యోగిబాబు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాడు. అలాగే దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రంలో ఓ శాసనసభ్యునిగా ప్రధాన పాత్రలో కనిపించడం విశేషం, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి ‘హిప్ హాప్’ తమిళ సంగీత దర్శకుడు.

No comment allowed please