Sapna Chaudhary : డ్యాన్సర్ స్వప్నా చౌదరికి అరెస్ట్ వారెంట్
టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనందుకు
Sapna Chaudhary : ప్రముఖ డ్యాన్సర్ స్వప్నా చౌదరికి కోలుకోలేని షాక్ తగిలింది. టికెట్ డబ్బును తిరిగి ఇవ్వనందుకు గాను ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.
గత ఏడాది 2021 నవంబర్ లో కూడా ఇదే కోర్టు ఈ కేసులో స్వప్నా చౌదరిపై(Sapna Chaudhary) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత ఆమె కోర్టుకు హాజరైన బెయిల్ పొందింది.
ఇదిలా ఉండగా ఆమె 2018లో షెడ్యూల్ చేయబడిన నృత్య కార్యక్రమానికి సంబంధించి ఈ కేసు. రద్దు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్ టికెట్ డబ్బును తిరిగి ఇవ్వలేదంటూ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.
ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు డ్యాన్సర్ స్వప్నా చౌదరి. తిరిగి విచారించిన కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎంత ప్రముఖ నటి అయినా లేదా నాట్యకారిణి అయినా చట్టం ముందు అంతా సమానులమేనన్న ధ్యాస ఉండాలని స్పష్టం చేసింది.
ఒక రకంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. మరోసారి విచారణకు స్వీకరించిన కోర్టు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శంతను త్యాగి తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు.
అంత లోపు డ్యాన్సర్ స్వప్నా చౌదరిని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఆమె సోమవారం కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ స్వప్నా చౌదరి హాజరు కాలేదు.
ఆమె తరపు వాదించిన న్యాయవాది సైతం ఎటువంటి మినహాయింపు అభ్యర్థనను దాఖలు చేయలేదు. దీంతో కోర్టు వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది. 2018 అక్టోబర్ 14న ఆషియానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Also Read : సినిమాలపై నాకు అవగాహన లేదు – కపిల్ శర్మ