Kaivalya Vohra Palicha : రూ. 1,000 కోట్ల క్లబ్ లో వోహ్రా..పాలిచా
19 ఏళ్లకే ఆదాయంలో అరుదైన ఘనత
Kaivalya Vohra Palicha : కైవల్య వోహ్రా..ఆదిత్ పాలిచా అరుదైన ఘనత సాధించారు. కేవలం 19 ఏళ్ల వయస్సులో అత్యధిక ఆదాయం కలిగిన వారిగా చరిత్ర సృష్టించారు.
ఒకరు రూ. 1,000 కోట్లతో మరొకరు రూ. 1,200 కోట్లతో విస్తు పోయేలా చేశారు. జెస్టో ఫౌండర్ కైవల్య వోహ్రా , ఆదిత్ పాలిచా(Kaivalya Vohra Palicha) ఇంతకు ముందు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రభావంతమైన 30 అండర్ 30 ఆసియా జాబితాలో ఇ-కామర్స్ విభాగంలో చోటు దక్కించుకుని ఔరా అనిపించారు.
కైవల్య వోహ్రా, ఆదిత్ పాలిచా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో అత్యంత చిన్న వయస్సు కలిగిన వ్యాపారవేత్తలుగా నిలిచారు. క్విక్ డెలివరీ స్టార్టప్ జెఫ్టో సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా , ఆదిత్ పాలిచా అరుదైన ఘనతను సాధించారు.
రూ. 1,000 కోట్ల నికర విలువతో 1036వ స్థానంలో నిలిచారు. ఆదిత్ పాలిచా 950వ స్థానంలో ఉన్నారు. అతడి నికర విలువ రూ. 1,200 కోట్లుగా ఉంది. ఈ యువ పారిశ్రామికవేత్తలు స్టార్టప్ సంస్థలకు ఆదర్శ ప్రాయంగా మారారు.
జెప్టోను స్థాపించిన కైవల్య వోహ్రా సాధించిన విజయం మామూలు విషయం కాదని పేర్కొంది హురున్ ఇండియా. వోహ్రా, పాలిచా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు.
తర్వాత వారు కంప్యూటర్ సైన్స్ ను విడిచి పెట్టారు. కరోనా మహమ్మారి రోజుల్లో అవసరమైన వస్తువులను త్వరగా, కాంటాక్ట్ లెస్ డెలివరీ కోసం పెరుగుతున్న డిమాండ్ ను నెరవేర్చేందుకు 2021లో జెప్టోను ప్రారంభించారు.
2018లో గోపూల్ పేరుతో విద్యార్థుల కోసం కార్ పూల్ సేవను ప్రారంభించాడు పాలిచా. ప్రైవసీలో ప్రాజెక్టు లీడర్ గా పనిచేశాడు. దుబాయిలో పెరిగిన చిన్ననాటి స్నేహితులు కిరానా కార్ట్ స్టార్టప్ ను ప్రారంభించారు.
Also Read : హురున్ రిచ్ లిస్ట్ లో దివిస్ టాప్