Jeff Bezos Adani : అదానీని దాటేసిన జెఫ్ బెజోస్
4వ స్థానానికి పడి పోయిన అదానీ
Jeff Bezos Adani : ఫోర్బ్స్ సంపన్నుల జాబితాను గురువారం ప్రకటించింది. ఊహించని రీతిలో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఉన్నట్టుండి నాలుగో స్థానానికి పడి పోయారు. అమెజాన్ చీఫ్, చైర్మన్ జెఫ్ బెజోస్(Jeff Bezos) రెండవ స్థానానికి చేరుకున్నాడు.
గత కొంత కాలంగా కుబేరుల స్థానాలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. వాల్ స్ట్రీట్ స్టాక్స్ ర్యాలీలో అమెజాన్ షేర్స్ వాల్యూ పెరగడంతో సంపద వృద్ది చెందింది. దీంతో 2వ స్థానానికి చేరుకున్నాడు.
రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో లూయిస్ విట్టన్ కు చెందిన ఆర్నాల్డ్ గౌతమ్ అదానీలను అధిగమించాడు. సెప్టెంబర్ 16 నుండి నాల్గో స్థానంలో కొనసాగిన తర్వాత జెఫ్ బెజోస్ నికర విలువ $3.6 బిలియన్లు పెరిగి $141.4 బిలియన్లకు చేరుకుంది.
బెర్నార్డ్ ఆర్నాల్డ్ అదానీలను(Adani) దాటేశాడు. అమెరికన్ బిలియనీర్ల సంపదను తగ్గించింది. ద్రవ్యోల్బణం రీడింగ్ తర్వాత మరింత దూకుడుగా ఉన్న ఫెడరల్ రిజర్వ్ అంచనాలతో నడిచింది. వాల్ స్ట్రీట్ షేర్లు పుంజుకున్నాయి.
ఇదిలా ఉండగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ 3వ స్థానం ఉండగా ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం $1.4 బిలియన్లు మాత్రమే. బెర్నార్డ్ ఆర్నాల్డ్ నికర విలువ $140.4 బిలియన్లుగా ఉంది. ఇక గౌతమ్ అదానీ ప్రస్తుతం 139.1 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి పడి పోయారు.
అయితే అదానీ సంపద గురువారం నాడు $796 మిలియన్లకు పడి పోయింది. భారతీయ ఈక్విటీ బెంచ్ మార్క్ లు ఆరు సెషన్ల వరుస నష్టాల నుండి కోలుకున్నప్పటికీ గౌతం అదానీ వాల్యూ పెరగక పోవడం గమనార్హం.
Also Read : మూడో స్థానానికి పడి పోయిన అదానీ